ఘనంగా ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ జన్మదిన వేడుకలు
బషీరాబాద్ : జడ్పిలో బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎంపీపీ కరుణ గారికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్,డిసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి,జిల్లాలోని జడ్పిటీసీలు,ఎంపీపీలు,జడ్పి అధికారులు,సర్పంచులు,బషీరాబాద్ ఎంపీడిఓ రమేష్,సర్పంచులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జిల్లా TSUTF క్యాలెండర్ ను జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గారు జడ్పిలో ఆవిష్కరించారు.ఉపాధ్యాయ సంఘాలు విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని సూచించారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్,సీఈఓ జానకీ రెడ్డి,TSUTF జిల్లా అధ్యక్షుడు సిఎచ్.వెంకట రత్నం,ప్రధాన కార్యదర్శి రాములు,కార్యదర్శులు పవన్ కుమార్,బాబూరావు,నర్సిములు,జమున,రత్నం,కృష్ణవేణి,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గోపాల్,జడ్పిటీసీలు,ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో కంటి వెలుగు
- ప్రజందరికి కంటి పరీక్షలు అవసరం
- 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత
- విద్యా శాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి
- జిల్లా అధికారులు మరియు మంత్రులు
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు పాల్కొన్నారు.అధికారులు మాట్లాడుతూ తెలంగాణ కంటి వెలుగు అవగాహన సదస్సు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి.జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.ప్రజందరికి కంటి పరీక్షలు అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాలు.ప్రతి గ్రామంలో,మున్సిపల్ వార్డులలో కంటి పరీక్షల శిబిరాలు.
దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజలోకి మన ప్రభుత్వం అందిస్తున్న,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం ప్రజాలోకి తెసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి,మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి,ఎంపిపి కరుణ అజయ్ ప్రసాద్,ఎంపిటిసి కోట్ల మహిపాల్,యలాల జెడ్పీటీసీ సిద్రాల సంధ్య, జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి,తదితర అధికారులు పాల్గొన్నారు.