ప్రజల కోసమే నా ప్రాణం "మీతో నేను"
- కంటి వెలుగు పథకం సేవలు
- ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని బుధవారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు "మీతో నేను" కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని బురాన్ పల్లి తండా మరియు బురాన్ పల్లి గ్రామంలో ఉదయం పర్యటించారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.స్వరాష్ట్ర తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి రుణపడి ఉండాలన్నారు.తెలంగాణ ప్రభుత్వం కంటి చూపు మందగించిన ప్రజల కోసం చారిత్రాత్మకమైన కంటి వెలుగు పథకం రెండో విడత ఈ నెల 18వ తేది నుండి ప్రారంభం అవుతుందని,కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.గ్రామంలో నూతన సీసీ రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు మరియు పిచ్చిమొక్కలను తొలగించి, పల్లె ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.
గ్రామంలో అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని,ఏర్పాటు చేసిన స్థంబాలకు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు,గ్రామంలో మరియు పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.గ్రామంలో మిషన్ భగీరథ నీటి ట్యాంక్ నిండిన ప్రతిసారి తగిన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలని, ప్రజలు మిషన్ భగీరథ మంచినీటిని త్రాగాలని,అందుకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు.ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.ఎమ్మెల్యే గారి మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా బురాన్ పల్లికి చెందిన లబ్ధిదారునికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కును వారి ఇంటికి స్వయంగా వెళ్లి అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.