నూతన రైల్వే స్టేషన్ కి కోయగూడెం అనే పేరు పెట్టాలి
- రైల్వే లైన్ నిర్మాణం మొత్తం కోయగూడెం గ్రామం
- రాజకీయ నాయకుల పైరవిలతో సర్వరాం పేరు
- జనాలను మోసం చేస్తున్న నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ కి కోయగూడెం అనే పేరు పెట్టాలని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్,కాకా శివశంకర్ ప్రసాద్,వాడే విరస్వామి.గ్రామ సభ తీర్మానం లేకుండా కోయగూడెం గ్రామంలో నిర్మించిన రైల్వేస్టేషన్ కు ఎలా పేరు పెట్టారు.తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) కొత్తగా కోయగూడెం గ్రామంలో నిర్మించిన రైల్వే స్టేషన్ కు కోయగూడెం పేరును పెట్టకుండా గ్రామ సభ తీర్మానం చేయకుండా సర్వరాం పేరును రైల్వే స్టేషన్ కి ఏ విధంగా నిర్ణయించారని దానికి అధికారులు సమాధానం చెప్పాలని జిల్లా నాయకులు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS ) జిల్లా నాయకులు మూతి రామకృష్ణ ప్రశ్నించారు.కోయగూడెం గ్రామపంచాయతీ ఎదుట కోయగూడెం రైల్వే స్టేషన్గా నామకరణ చేయాలని డిమాండ్ చేస్తూ సంఘ మధ్యలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూర్గంపహాడ్ మాజీ MLA కంగాల బుచ్చయ్య గారి స్వంత గ్రామం ప్రస్తుత సుజాతనగర్ మండలం కోయగూడెం గ్రామం.
ఈ గ్రామంలో నివసిస్తున్న వారు ఆదివాసీలు సత్తుపల్లి నుండి కొత్తగూడెం రైల్వే లైన్ నిర్మాణం కోసం ఇక్కడి ఆదివాసీలు తమ సొంత భూములను కోల్పయారు.రైల్వే లైన్ నిర్మాణం మొత్తం కోయగూడెం గ్రామం పేరు మీద జరిగాయి.రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత స్టేషన్ పేరు రాజకీయ నాయకుల పైరవిలతో కోయగూడెం స్టేషన్ అని కాకుండా సర్వరాం పేరును పెట్టారు.అక్కడ ఆదివాసీలు మా భూములు కోల్పోయి,మా గ్రామ పంచాయతి పరిధిలో ఉన్న మా రైల్వే స్టేషన్ కు కోయగూడెం పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తక్షణమే రైల్వే స్టేషన్ కి కోయగూడెం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శికి కోయగూడెం రైల్వే స్టేషన్ గా నామకరణం చేయాలని తీర్మానం చేయాలని వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది.