కొత్త రూల్స్ పాటించాల్సిందే... లేకపోతే అంతే సంగతి
- ప్రతి శాఖలో ఫేషియల్ రికగ్నిషన్ యాప్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాది కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.ఉద్యోగులకు ఇక చెక్ పెట్టాల్సిందే ఉద్యోగులు ఇకపై తమ హాజరును ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది.ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల్లోను అమలు చేయనున్నారు.మరోవైపు అటెండెన్స్ పై ప్రభుత్వ నిబంధనలపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.మరోవైపు జనవరి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు.ఉద్యోగులు యాప్లను డౌన్లోడ్ చేసుకుని అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగులతో పాటు డీడీఓలకు యాప్ వినియోగంపై మార్గదర్శాలు ఇప్పటికే జారీ చేశారు.
ఏపీసిఎఫ్ఎస్ఎస్ వెబ్ సైట్,గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకుని వినియోగించాల్సి ఉంటుంది.ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్రెడ్డిని ఏపీ రెవిన్యూ సర్వీసెస్,ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతల కోరారు.ఉద్యోగుల వేతనాల చెల్లింపుల జాప్యం జరుగుతుండటం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని సీఎస్ దృష్టికి తీసుకువెళ్లారు.గత రెండేళ్లుగా జీపిఎఫ్ రుణాలు, రిటైర్డ్ సిబ్బందికి అందాల్సిన ప్రయోజనాలు,మెడికల్ రియింబర్స్మెంట్ వంటివి సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చీఫ్ సెక్రటరీకి వివరించారు.