Type Here to Get Search Results !

Sports Ad

తాండూర్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి The problem of traffic in Tandoor should be solved

 

తాండూర్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి

- డిఎస్పి శేఖర్ గౌడ్ గారిని కలిసి వినతి
- నిరంతరం పెట్రోలింగ్ చేయాలని విజ్ఞప్తి 

తాండూర్ : తాండూర్ లో కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మించాలని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని నిరంతరం రద్దీ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ చేయాలని కోరారు.ఈ రోజు తాండూర్ డిఎస్పి శేఖర్ గౌడ్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన తాండూర్ పబ్లిక్ వాయిస్ ఫోరం ప్రతినిధులు జిలాని భాను పవర్ జే ప్రకాష్ మల్లు యాదవ్ రాము గౌడ్ వెంకటేష్ గౌడ్ శివ పవర్ ప్రశాంత్ పాల్గొన్నారు.అనంతరం పబ్లిక్ వాయిస్ ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ తాండూర్ లో దినదినం జనాభా పెరుగుతున్న దృశ్య తాండూరు నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వ్యాపారం రిత్య తాండూర్ కు రావడం వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని అదేవిధంగా కర్ణాటక ప్రాంతం మనకు సరిహద్దుగా ఉండటం వల్ల అక్కడి వాహనాలు కూడా రావడం వల్ల తాండూరులో విపరీతంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని డీఎస్పీగా దృష్టికి తీసుకుపోవడం జరిగింది.నిరంతరం బస్టాండ్ ఏరియా శివాజీ చౌక్ గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లలో పెట్రోలింగ్ చేయాలని డిఎస్పి గారిని కోరడం జరిగింది దీనికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.అనంతరం డిఎస్పి గారిని సన్మానించారు.ఈ యొక్క కార్యక్రమాలలో తాండూర్ యువకులు తదితరులు పాల్కొన్నారు.



జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలి 

- షేక్ ఫాతిమా,సావిత్రిబాయి పూలే కారణం
- సమాజంలో మహిళలు నిర్భయంగా ముందుకు సాగాలి 

జినుగుర్తి మోడల్ స్కూల్లో షేక్ ఫాతిమా జయంతిని పురస్కరించుకుని వారం రోజులపాటు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది.అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది.ఈ సందర్భంగా టిఆర్ఎస్వి స్టూడెంట్ తాండూర్ ఇంచార్జ్ జిలాని మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు నిర్భయంగా  చదువుతున్నారు అంటే దానికి కారణం షేక్ ఫాతిమా సావిత్రిబాయి పూలే అని చెప్పక తప్పదు కావున వీరి యొక్క జీవిత చరిత్రపై విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి యొక్క జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రకాష్ గౌడ్ వాయిస్ ప్రిన్సిపల్ నర్సింలు న్యాయవాది మల్లు యాదవ్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలను నియామకం

తాండూర్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 13 మరియు14 బుధవారం రోజున బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలను నియమించారు.ఇట్టి కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్,పట్టణ పార్టీ అధ్యక్షులు నయూమ్ అప్పు,సీనియర్ నాయకులు నర్సింలు మరియు మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు అనసూయ పాల్కొన్నారు.మరియు బూత్ ఇంచార్జ్ లను 100 ఓట్లకు ఒక ఇంచార్జ్ ను మహిళ లీడర్ లను యూత్ ఇంచార్జ్ లను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లను నియమించడం జరిగింది.ఇట్టి నియామకాలు అన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇట్టి కార్యక్రమానికి క్లస్టర్ ఇంచార్జ్ నరేందర్ గౌడ్ అధ్యక్షతగా నియమించారు.వార్డ్ నెంబర్ 13 కు వాడ్ ఇంచార్జిగా హరిహర గౌడ్,వార్డ్ నెంబర్ 14 కు డేవిడ్ గారిని నియమించారు.ఈ కార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies