బీజేపీ,బీఆర్ఎస్ అంశాలు బయటే చూసుకోవాలి
హైదరాబాద్ : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వ అప్పీల్‌పై హైకోర్టులో వాదనలు సాగాయి. కేసు ఫైల్స్ కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సోమవారం వరకు ఫైల్స్ కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐకి కోర్టు తెలిపింది.కేసు ఫైల్స్ కోసం సీఎస్‌కు లేఖ రాసినట్లు సీబీఐ పేర్కొంది.కేసు ఫైల్స్ ఇస్తే విచారణకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది.సుప్రీం న్యాయవాది దవే వాదనల కోసం సోమవారం వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.కేసు సీబీఐకి ఇవ్వడమే సరైందని హైకోర్టులో బీజేపీ వాదనలు వినిపించింది.2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని న్యాయస్థానానికి తెలిపింది. బీజేపీ పిటిషన్‌ను కొట్టివేసినా అప్పీల్ ఎందుకు చేశారని ఏజీని హైకోర్టు అడిగింది.పిటిషన్ కొట్టివేయడానికి కారణాలు సరిగా లేవని ధర్మాసనానికి ఏజీ తెలిపారు.బీజేపీ,బీఆర్ఎస్ అంశాలు బయటే చూసుకోవాలని వ్యాఖ్యానించింది.ఈ అంశాలు కోర్టులోకి తీసుకురావద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను సోమవారంకు వాయిదా వేసింది.
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ అరెస్ట్
కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలు.కేసీఆర్ డౌన్ డౌన్ పోలీసు జులుం నశించాలంటూ రైతుల,మహిళల,కార్యకర్తల నినాదాలు.కార్యకర్తల పెనుగులాట మధ్య బండి సంజయ్ ను జీపులోకి ఎక్కించిన పోలీసులు పోలీసులు లాఠీచార్జి లో పలువురు కార్యకర్తలకు గాయాలు సొమ్మసిల్లి పడిపోయిన కార్యకర్తలు.రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగుతోందని బండి సంజయ్ స్పష్టీకరణ.కామారెడ్డి కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ అరెస్ట్.కలేక్టరేట్ లోకి వెళ్లకుండా గేట్లను మూసేసిన పోలీసులు.భారీగా మోహరించిన పోలీసులు కలెక్టరేట్ కార్యాలయంలోకి అనుమతించాలంటూ రైతులు బీజేపీ కార్యకర్తల నినాదాలు కలెక్టరేట్ లోకి అనుమతించని పోలీసులు.
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం,తోపులాట బారికేడ్లను తీసుకొని ముందుకు వచ్చిన రైతులు,కార్యకర్తలు కలెక్టరేట్ గేట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న రైతులు,మహిళలు,కార్యకర్తలు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత.సీఎం కేసీఆర్ పోలీసుల తీరుపై రైతుల బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం.బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.అడ్డుకున్న కార్యకర్తలు,రైతులు కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ చేస్తూ చెదరగొడుతున్న పోలీసులు.