Type Here to Get Search Results !

Sports Ad

టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి The process of transfer of teachers should be transparent

టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

- అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీల ప్రక్రియను పక్కాగా,పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.తన కార్యాలయంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె సమీక్షించారు.పూర్తి పారదర్శకత,జవాబుదారితనంతో లోపాలకు తావులేకుండా పదోన్నతులు,బదిలీల ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు,షెడ్యూల్‌కు సంబంధించి త్వరితగతిన తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకుంటున్నందున ఇందుకోసం వినియోగించే సాఫ్ట్ వేర్ లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.పదోన్నతులు,బదిలీల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని,ఈ ప్రక్రియకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.బదిలీ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేలా వివిధ స్థాయిల్లో అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షలుగా నియమించాలని సూచించారు.ప్రభుత్వం తీసుకున్న ఉపాధ్యాయ సానుకూల నిర్ణయం విజయవంతం అయి,పదోన్నతులు,బదిలీలు సాఫీగా జరగాలని కోరారు.ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies