Type Here to Get Search Results !

Sports Ad

అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి Reporter journalist

 

అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి

* ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది.

* అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!! తెలుసుకొండి..

* అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..?? వారు సంపాదకులు కారా.

* అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ.తెలుసుకోండి,కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా.

*  అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు,అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌ భంగం కలిగించడమే అవుతుంది.

* ప్రభుత్వమైనా,ప్రభుత్వ అధికారులైన,సంస్థలైనా,ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు.

* ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ journalist అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం ఇది తెలుసా.

* అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…?? ఉంటే కొంచెం చూపించండి  INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా ?

* PRINT MEDIA,ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా ? ఆయా జిల్లా కలెక్టర్లు,DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు.?

* నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి,నోరు కొట్టు కుంటున్నారు.రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటార ?

* రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు.

* అక్రిడేషన్ కొలమానం కాదు.అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే 

* మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు?? వారికి లేని బాధ మీకెందుకు ?

*అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో,సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి.

*** ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి *** 

* ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి, ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని,సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు ? గమనించండి.

* ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా ?

* ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం,వార్తలో సత్తా ఉండాలి.ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి కత్తిలా మార్చండి.

* జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి,జర్నలిజంలోకి రావాలనుకునే వారికి అక్రిడేషన్ కార్డు జీవితం కాదు,జాబ్ కార్డ్ కాదు.మీరు రాబట్టిన సమాచారాన్ని,నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.

* అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా లేకపోతే మీకు అందదా అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies