Type Here to Get Search Results !

Sports Ad

భద్రాది నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర Revanth Reddy's Padayatra from Bhadradhi

 

భద్రాది నుంచే రేవంత్ రెడ్డి పాదయాత్ర

- సెంటిమెంట్ అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు కసరత్తు

భద్రాది : దేశమంతా రాజకీయ పాదయాత్రల కాలం సాగుతోంది.జనం కష్టాలు తెలుసుకోవడంతోపాటు వారికి దగ్గరయ్యేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణలోనూ పాదయాత్రల సీజన్‌ కొనసాగుతోంది.ఇప్పటికే షర్మిల తెలంగాణను చుట్టేశారు. ఇప్పుడు కొత్తగా రేవంత్‌రెడ్డి కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.భద్రాచలం వేదికగా తొలి అడుగు వేయబోతున్నారు.ఇంతకీ పాదయాత్రకు రేవంత్‌రెడ్డి భద్రాచలాన్నే ఎందుకు ఎంచుకున్నారు? బీఆర్ఎస్,బీజేపీపై దండయాత్రకు రేవంత్ ఎంచుకున్న సెంటిమెంట్ అస్త్రాలేంటి.ఏడేళ్లుగా రామాలయం వైపు కన్నెత్తి చూడని కేసీఆర్ భద్రాచలం అంటే సాక్షాత్తు శ్రీరాముడు నడయాడిన నేల భూలోక వైకుఠంగా దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం కోట్లాది మంది భక్తులు కొనియాడే గొప్ప ఆలయం.కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక భద్రాద్రిపై శీతకన్ను వేసారని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి.ముఖ్యమంత్రిగా 2015లో తొలిసారి సీతారాముల కళ్యాణానికి హాజరైన కేసీఆర్ అప్పటినుంచి ఏడేళ్లుగా రామాలయం వైపు కన్నెత్తి చూడలేదు.

శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.ఉమ్మడి ఏపీలోనూ కొనసాగింది.అయితే కేసీఆర్ ఆ ఆనవాయితీకి మంగళం పాడారు అంతేకాదు వంద కోట్లతో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామన్న వాగ్ధానమూ అటకెక్కింది.కేసీఆర్ పాలనలో పాలక మండలి నియామకం కూడా లేక పాలన గాడి తప్పింది.దీంతో భద్రాద్రి రామయ్య పట్ల కేసీఆర్ వ్యవహార శైలిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా సెంటిమెంట్ అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు టీ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.ప్రజలికిచ్చిన మాట కాదు ఏకంగా దేవుడికిచ్చిన మాట కూడా తప్పిన కేసీఆర్‌ను ఎలా నమ్ముతారనే అంశాన్ని సెంటిమెంట్‌గా ప్రయోగించబోతున్నారు.యాదాద్రి విషయంలో ఒకలా.. భద్రాద్రి విషయంలో మరోలా ఉన్నారంటూ కేసీఆర్‌ని ఇరుకున పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారనే టాక్‌ నడుస్తోంది.

క్లీన్ స్వీప్‌తో కాంగ్రెస్‌కు జై కొట్టిన భద్రాద్రి జిల్లా రేవంత్‌రెడ్డి పాదయాత్రకు భద్రాచలాన్ని ఎంచుకోవడంలో మరో ముఖ్య కారణం కూడా ఉందని చెప్పొచ్చు.గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్‌తో కాంగ్రెస్‌కు జై కొట్టిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం నిలిచింది.భద్రాద్రి జిల్లాలోనున్న ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. భద్రాచలంలో పొదెం వీరయ్య, పినపాకలో రేగా కాంతారావు, ఇల్లందులో హరిప్రియ, కొత్తగూడెంలో వనమా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.అశ్వరావుపేటలో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకుండా జనం కాంగ్రెస్‌కు జై కొట్టారు.అయితే కాంగ్రెస్ తరపున గెలిచిన ముగ్గురు,టీడీపీ నుంచి గెలిచిన ఒకరు బీఆర్ఎస్‌లోకి జంప్‌ అయ్యారు.కానీ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాత్రం విలువలకు కట్టుబడి కాంగ్రెస్‌లోనే ఉన్నారు.

ప్రజా వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునేందుకు భారీ స్కెచ్‌ ఇదిలావుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తి ఏజెన్సీ ప్రాంతం.ప్రధానంగా పోడు భూముల రగడ కార్చిచ్చులా మారింది.పోడు రైతులకు పట్టాలు ఇస్తామన్న వాగ్దానం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినా ఇంకా నెరవేరలేదు.స్వయంగా కేసీఆర్ పలుమార్లు పోడు పట్టాలు ఇస్తామని ప్రకటించినా అతీగతీ లేకుండా పోయింది ఇదిచాలదన్నట్లు హరితహారం పేరుతో పోడు భూముల్లోని పంటలను ధ్వంసం చేయడం.ఆదివాసీ గిరిజన పోడు రైతులపై లాఠీచార్జీలు,అక్రమ కేసులతో అడవికి దూరం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.చివరికి కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు,అణచివేతపై విసుగు చెందిన ఆదివాసీ రైతులు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావును హత్య చేయడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది.దీంతో పోడు రైతులు,ఫారెస్ట్ సిబ్బందికి పంచాయతీ పెట్టిన పెద్దన్నగా ప్రభుత్వం మారింది.పోడు భూముల వ్యవహారం రావణకాష్టంలా మారినా ప్రభుత్వం పరిష్కారం చేయకుండా కమిటీలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది.పోడు సమస్యతోపాటు సింగరేణి కార్మికుల సమస్యలు,డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు,దళిత బంద్ బంద్‌ అవడం ఇలా ఎన్నో సమస్యలు బీఆర్ఎస్‌ను వెంటాడుతున్నాయి.ప్రభుత్వంపై పెద్దయెత్తున వ్యవతిరేక వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దాన్ని క్యాష్‌ చేసుకునేందుకు రేవంత్‌ భారీ స్కెచ్‌ వేశారనే ప్రచారం జరుగుతోంది.గత ఎన్నికల్లో కేసీఆర్‌పైనున్న వ్యతిరేకతే భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


భద్రాచలం సెంటిమెంట్‌,కాంగ్రెస్‌ కంచుకోట పాదయాత్రలపై కొందరు ఔట్‌డేట్‌గా మారాయని విమర్శలు చేస్తుండగా రాహూల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర పౌర సమాజాన్ని తట్టిలేపిందని చెప్పొచ్చు.రాహూల్ స్ఫూర్తితో.. రేవంత్ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో పాదయాత్రలు చేసి వైయస్,చంద్రబాబు ముఖ్యమంత్రులు అయ్యారు.ఈ క్రమంలోనే గత పాదయాత్రల ప్రేరణతోపాటు బీఆర్ఎస్‌ ప్రభుత్వ తీరును,కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహాంతో రేవంత్ అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది.భద్రాచలం సెంటిమెంట్‌,కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీలు గిరిజనులు,సింగరేణి కార్మికులు, కేటీపీఎస్ కార్మికులతోపాటు యువతకు కనెక్ట్ అయ్యేందుకే రేవంత్‌రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారని కాంగ్రెస్‌ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి.

ఓటు బ్యాంక్ రాజకీయాలకే రామ జపం మరోవైపు దేవుడంటే మా పార్టీనే మాట్లాడాలి అన్నట్టుగా ఉన్న బీజేపీని టార్గెట్ చేసేందుకు కూడా.. రేవంత్‌రెడ్డి భద్రాచలాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న బీజేపీ దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం.. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే రామ జపం చేస్తున్నారని కమలనాథులను టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు కర్నాటక కేసీఆర్ సుఫారీ అంశం.. రేవంత్ పాదయాత్రకు పొలిటికల్ వెపన్‌గా మారనుంది. కర్నాటకలో కాంగ్రెస్‌ను ఓడించడానికి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు 500 కోట్లు ఆఫర్ చేశారని కన్నడ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.కేసీఆర్ బీజేపీకి బీ టీమ్‌గా మారారనడానికి కర్నాటక సుఫారీ అంశమే నిదర్శనమని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ బృందం వ్యూహాలు రచిస్తోంది.

లిక్కర్ స్కామ్‌లో కవిత పట్ల బీజేపీ ఉదాశీనంగా వ్యవహరిస్తుందనే అంశాన్ని రేవంత్ ఆయుధంగా మార్చుకుని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.కర్నాటక సుఫారీ అంశం,కవిత లిక్కర్ స్కామ్‌ను ఎండగడుతూ వన్ షాట్ టూ బర్డ్స్‌ మాదిరిగా బీజేపీ,బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేలా అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని తహతహ భద్రాద్రి రామయ్య విషయంలో కేసీఆర్ భయపడుతుంటే రేవంత్‌రెడ్డి మాత్రం ఆయన్నే నమ్ముకుని సెంటిమెంట్‌ అస్త్రాలు సంధించబోతున్నారు. ఏదేమైనా భద్రాచలం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలనుకుంటున్న రేవంత్‌రెడ్డికి ఆ రాములోరి ఆశీస్సులు ఏ మేరకు దక్కుతాయో చూడాలి మరి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies