పేద కుటుంబాని ఆదుకున్న సమాచార హక్కు రక్షణ చట్టం
మహబూబ్ నగర్ : ఓ పేద కుటుంబానికి 31వేయి రూపాయలు ఆర్థిక సహాయం చేసిన రాష్ట్ర కమిటీ మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ కార్యకర్తలు.గత రెండు నెలల క్రితం ప్రైవేట్ రుణ యాప్ వేదింపులకు బలి అయిన యువకుడు వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి చెందిన దాసరి శేకర్ ప్రైవేట్ రుణ యాప్ లో 2200 అప్పుగా తీసుకుని చెల్లించిన కూడా,వారు అసలుకు అదనపు వడ్డీలు కలిపి 30,000 రూ చెల్లించాడు.అయిన వదలని వారు తనకు పోన్ కాంటాక్ట్ లో వున్న వారందరికీ సదరు వ్యక్తి గురించి చెడుగా మెసేజ్ లు పెడుతూ.అతని పోటోలను మార్పింగ్ చేసి అశ్లీల పోటోలు గా మార్చి తనకు కాంటాక్ట్ లో ఉన్న వారికి పంపుతూ.వేదించడంతో అవమాన భారంగా భావించిన శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శేకర్ కి 4 సం,రాలు మరియు 6 సం,రాలు వయస్సు కలిగిన ఆడపిల్లలు ఉన్నారు.వారికి సమాచార హక్కు రక్షణ చట్టం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బృందం వెళ్లి 31వెయ్యి రూపాయలను శేఖర్ భార్యకు పిల్లలకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంఛార్జి మోగిలి శేఖర్ ,వనపర్తి జిల్లా అధ్యక్షులు సాయిబాబా,నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కృష్ణ ప్రసాద్,మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి వనపర్తి జిల్లా ట్రెజర్ బాలముకుందం రంజిత్ వనపర్తి జిల్లా పొలిటికల్ కన్వీనర్ చందు కొత్తకోట మండల ప్రెసిడెంట్ దాసరి శివ ఇంచార్జ్ సర్వేశ్వర చారి కొత్తకోట మండల వైస్ ప్రెసిడెంట్ సంద సాయికుమార్ మరియు వివిధ జిల్లాల RTI సొసైటీ కార్యకర్తలు మరియు భారత్, యాదగిరి పాల్గొన్నారు.మా RTI సొసైటీ కార్యకర్త లకు,పేద ప్రజల కు ఏ ఆపద వచ్చిన ముందు ఉంటాం అని,రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరుపేద శేఖర్ కుటుంబానికి సహాయం చేసిన మానవతా వాదులకు పాదాభివందనలు అని సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ బృందం అన్నారు.