తెలంగాణ ఉపాధ్యాయులకు సంక్రాంతి పండుగ
తెలంగాణ : రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు.టీచర్ల పదోన్నతులు,బదిలీలకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,హరీశ్‌రావు వెల్లడించారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మరో రెండు,మూడు రోజుల్లో పదోన్నతులు,బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుకగా బదిలీలకు,ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రెండు,మూడు రోజుల్లో దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేయనుంది.కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.
ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 9,266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు.ఫిబ్రవరి 10 నాటికి పదోన్నతులు,బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ విడుదల చేయనున్నారు.విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతే రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, రీశ్‌రావు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెల్లడించారు.ఈ ప్రకటనతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం లోని ఎక్మాయ్ గ్రామం లో ఎక్కువ చదువులు చదివిన వాళ్ళు వున్నా రు. విషయం :ఎక్మాయ్ లో పోటీ పరీక్ష లకు సిద్ధం కావడానికి ఆర్థిక స్తొమత లేక ఎందరో విద్యార్థులలు వేస్టుగా వున్నారు కావున ఎక్మాయ్ గ్రామం లో గ్రంథం లయం ఏర్పాటు చేయాలని ఒక నిరుద్యోగగి ఆశయం.
ReplyDelete