సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
వికారాబాద్ : సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి.ఆడపిల్లల జీవితంలో అక్షర సంతకమై వలసి మనువాద భావజాలానికి వ్యతిరేకంగా మూడ విశ్వాసాలను రూపుమాపడం కోసం,సామాజిక చైతన్య దీపికగా మహిళలను చైతన్య పరచి స్త్రీలకు విద్యనందించి సామాజిక కార్యకర్తగా,సంఘ సంస్కర్తగా జీవితాంతం కృషిచేసి తన జీవితాన్ని సమాజానికి అంకితం ఇచ్చారు.సావిత్రిబాయి పూలేకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి జరిగింది.సావిత్రిబాయి పూలే గారి 18 సంత్సరాలు వచ్చే నాటికి తానే స్వయంగా స్త్రీలకు విద్యను అందించడం కోసం 20 పాఠశాలల నిర్మాణం చేశారు.సావిత్రిబాయి పూలే జీవితమంత కూడా స్త్రీలను చైతన్య పరచడం కోసం కృషి చేశారు.నేటి మహిళలందరూ కూడా సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో సమానత్వానికై పోరాడాలి.ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వై.గీత మహేందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలు తదితరులు పాల్కొన్నారు.
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే
తాండూర్ : చదువుల తల్లి సంఘ సంస్కర్త ఈ దేశపు మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు అయినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పి.అరుణ్ రాజు ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ కార్యాలయంలో ఆ మహాతల్లి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ అంజద్ అలీ గారు యాలాల్ మండల కన్వీనర్ ఎం కృష్ణ గారు మరియు పెద్దేమూల్ మండల కన్వీనర్ ఎం రమేష్ గారు పార్టీ నాయకులు సల్మాన్ గారు యాదయ్య లక్ష్మి తదిపరులు పాల్గొన్నారు.