SBI ATM లో 19,00,200/- డబ్బును దొంగతనం
- డయల్ 100 కాల్ కి తక్షణమే స్పందించిన కోరుట్ల బ్లూ కోల్ట్ సిబ్బంది
- రాత్రి జరిగిన SBI ATM చోరీ చేసి డబ్బుతో పారిపోతున్న
- దుండగులు ఉన్న కారును అడ్డుకున్న పోలీసులు
- కోరుట్ల ఎస్ఐ సతీష్ బ్లూ కొల్ట్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ సింధూ శర్మ
జగిత్యాల : జగిత్యాల జిల్లా శనివారం రోజున అర్ధరాత్రి కోరుట్ల పట్టణంలోని రాత్రి ఒంటిగంట సమయంలో SBI బ్యాంక్ దగ్గర ఉన్న ఏటీఎంలో చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు చోరీ జరుగుతుందని అలారం ద్వారా తెలుసుకున్న బ్యాంక్ వారు డయల్ 100 ద్వారా కోరుట్ల ఎస్సై సతీష్ గారికి సమాచారం అందించగా ఎస్సై సతీష్ బ్లూ కోల్డ్ సిబ్బందిని అలర్ట్ చేయగా.తక్షణమే స్పందించిన బ్లూ కోర్ట్ సిబ్బంది ఏటీఎం నుండి 19,00,200/- డబ్బును దొంగతనం చేసి కారులో పారిపోతుండగా అడ్డుకొని డబ్బులును రికవరీ చేసారు.ఏటీఎం చోరీ నిందితుల గురించి జగిత్యాల డిఎస్పి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు పట్టారు.SBI ATM లో ఉన్న డబ్బులను చోరీ కాకుండా నిలువరించిన పోలీస్ సిబ్బందిని మెడి రాజయ్య,హెడ్ కానిస్టేబుల్ కోరుట్ల, గట్టు శ్రీనివాస్,కానిస్టేబుల్ కోరుట్ల,మధు ప్రైవేట్ డ్రైవర్ లను జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఈ సందర్భంగా అభినందించారు.