లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ
హైదరాబాద్ : హైదరాబాద్ బహదూర్‌పురా పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.ఓ సిటిజెన్ నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తి ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.అయితే తన ఫోన్ తనకు తిరిగి ఇవ్వాలని బాధిత వ్యక్తి ఎస్ఐ శ్రవణ్ కుమార్‌ను సంప్రదించాడు.ఈ క్రమంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.ఎస్ఐ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
బ్రెయిన్ స్ట్రోక్‌తో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ మృతి
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ కరుణాకర్ హఠాన్మరణం చెందారు.గురువారం రాత్రి కార్పొరేటర్ కరుణాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.అయితే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో కార్పొరేటర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.రెండేండ్ల క్రితం కరుణాకర్ కూతురు భవాని కరోనా మృతిచెందారు.కరోనా బారిన పడిన భవాని దవాఖానలో చికిత్స పొందుతూ 2021,మే 10న చనిపోయారు.కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగిలింది.