ప్రమాదాలు లేని సంస్థగా సింగరేణి
బెల్లంపల్లి : బెల్లంపల్లి ఏరియా వర్క్ షాప్ ఆవరణలో బుధవారం ఏరియా స్టోర్ మరియు వర్క్ షాప్ లో పని చేసే ఉద్యోగులకు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎస్ఓ జిఎం కెఎచ్ఎన్ గుప్తా మాట్లాడుతూ సింగరేణి ని ప్రమాదాలు లేని సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రతిఉద్యోగి కృషి చేయాలని అన్నారు.ప్రమాదాలకు మూల కారణం మనవ తప్పిదాలని వాటిని నియంత్రించడానికి రక్షణ సూత్రాలు పాటిస్తూ పరికరాలు ధరించాలని పనులు చేయాలని అన్నారు.ఎస్ఎంటిసి ఎస్ఓఎం జివిఎన్ విజయ్ కుమార్,సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు పై ఉద్యోగులకు ప్రొజెక్టర్ (పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ద్వారా రక్షణతో చేసే పనులపై అవగాహన కల్పించారు.అవగాహన లేమి,అతివేగంతో ముగించాలనే ఆలోచనతో చేసే పనులు ప్రమాదాలకు కారణం అవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఎజిఎం తిరుమల్ రావు,వర్క్ షాప్ డిజిఎం క్రిష్ణ మూర్తి,స్టోర్ డిజిఎం శ్రీనివాస్ రావు,బెల్లంపల్లి ఓసి 2 మేనేజర్ మహేష్ కుమార్,వెల్ఫేర్ ఆఫీసర్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
మద్దిశెట్టి సామేలు అక్రమ అరెస్ట్
ఖమ్మం : ఖమ్మం జిల్లా ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఖమ్మంలో జరిగే సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు గారిని ఈ రోజు తెల్లవారు జామున 5 గంటలకు సత్తుపల్లి పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది.కెసిఆర్ సభ నేపథ్యంలో జిల్లాలోని నాయకులను అరెస్ట్ చేయడం సమంజసం కాదు.ఈ విషయాన్ని భారతీయ సర్వ సమాజ్ మహసంఘ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.