ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి
- హైకోర్టు 7 మార్కులను కలపాలని ఇచ్చిన ఉత్తర్వులు అములు చేయాలి
- పరుగు పందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు
- మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలి
- PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్
తాండూర్ : తాండూర్ పట్టణంలో పరుగు పందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం కల్పించి, పోలీస్ రిక్రూట్మెంట్ లో కొత్తగా ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలను తొలగించి,ప్రిలిమ్స్ ప్రాథమిక మల్టిపుల్ ఛాయిస్ పరీక్షల్లో తప్పుగా వచ్చిన ఏడు ప్రశ్నలకు న్యాయస్థానం ఆదేశానుసారంగా మార్కులను కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం పిలుపు మేరకు PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి ఎన్నికల జమిక్కులు చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతుంది.
దేశంలో ఏ రాష్ట్రంలోని లేని నిబంధనలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాలలో పెట్టడం దుర్మార్గమైన చర్య.గత పాత పద్ధతిలో నియామకాలు చెయ్యాలని అభ్యర్థులు చెబుతున్న టి.ఎస్.ఎల్.పి.అర్.బీ, ప్రభుత్వం పట్టించుకోకుండా మానసికంగా,శారీరకంగా అభ్యర్థులను ఇబ్బందికి గురిచేస్తుంది.ఇప్పటికే కానిస్టేబుల్ గా పనిచేస్తూ ప్రస్తుతం ఎస్ఐ పోటీ కోసం పోటీ పడుతూ ఈవెంట్స్ లో ఫెయిల్ అయిన వారు కోకొల్లలు ఉన్నారు అంటే రిక్రూట్మెంట్ లో ఎంత కఠిన నిబంధనలు ఉన్నాయో అర్థం అవుతుంది.ప్రిలిమ్స్ పరీక్షల్లో నెగిటివ్ స్కోరింగ్ లోను 120111 మార్కులు వచ్చిన మెరిట్ విద్యార్థులు కఠినమైన నిబంధనల వల్ల మెయిన్స్ కి దూరం అవుతున్నారు.
అభ్యర్థులకు కనీసం తాగే నీళ్లు కూడా అందించకుండా రన్నింగ్ అయిపోగానే వెంటనే లాంగ్ జంప్ నిర్వహించడం అంటే అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడటమే.రాష్ట్రవ్యాప్తంగా అనేక శాఖలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో వచ్చిన నోటిఫికేషన్ లో కూడా అభ్యర్థులకు అన్యాయం చేయడం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పౌరుల జీవితాలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.అని తక్షణమే కానిస్టేబుల్ ఎస్సై పోలీస్ రిక్రూట్మెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధన తొలగించి, ప్రాథమిక పరీక్ష ప్రశ్నాపత్రంలో న్యాయస్థానం ఆదేశానుసారం మార్కులు కలిపి,న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ ను బర్తరప్ చేసి,రన్నింగ్ లో అర్హత పొందిన వారందరికీ మెయిన్స్ కి అవకాశం ఇచ్చి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
బషీరాబాద్ మండలం లో ని అధికారులు సరిగా పని చేయడం లేదు అందులో పేద వాళ్లకు గౌర్నమెంట్ ఇచ్చే పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారు ప్రతి పనికి లంచం తీసుకొని గౌర్నమెంట్ ఇచ్చే పథకం అందజేస్తున్నారు ఇదే విషయం లో ఎక్మాయ్ గ్రామ ప్రజలకు చాల అన్యాయం జరుగుతుంది ముక్యంగా pmkisan ఎక్మాయ్ ప్రజలకు రావడం లేదు
ReplyDeleteCSC center ki velli status check chesukondi
Delete