Type Here to Get Search Results !

Sports Ad

ఆటో బైక్ యాక్సిడెంట్ స్పాట్ డెడ్ Auto bike accident



ఆటో బైక్ యాక్సిడెంట్ స్పాట్ డెడ్ 

బషీరాబాద్ : ఆటో బైక్ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు.ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రం సుమారు 4:00 గంటలకు బషీరాబాద్ మండల పరిధిలోని కాశీంపూర్ గ్రామ శివారులో నారాయణపూర్ గేట్ మలుపు వద్ద బషీరాబాద్ నుండి తాండూరు వైపు వెళ్తున్న ఆటో మరియు తాండూరు నుండి బషీరాబాద్ వైపూ వస్తున్నా బైక్ ఎదురుగా ఢీ కొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.ఆటోలో ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.ఇట్టి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను మరియూ మృతదేహాన్ని ఆసుపత్రిలో తరలించారు.మృతుడి వివరాలు తెలుసుకోగా కొడంగల్ మండలం టేకులకోడ్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అని తెలిసింది.అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు సమాచారము అందించారు.ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన వ్యక్తి దోమ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లక్ష్మయ్య వయస్సు 45 సంవత్సరాలు తాండూరు ఆసుపత్రి తాలించారు.మెరుగైన వైద్యం కోసం తాండూర్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies