Type Here to Get Search Results !

Sports Ad

ఫాతిమా షేక్ ఆదర్శంగా తీసుకోవాలి



 ఫాతిమా షేక్ ఆదర్శంగా తీసుకోవాలి 


- మైనార్టీ బాలికల పాఠశాల,కళాశాలలో షేక్ ఫాతిమా
- ఎస్సే రైటింగ్ కాంపిటీషన్
- గెలుపొందిన వారికీ బహుమతులు 
- మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది కే.గోపాల్,జిలాని 

తాండూర్ Tandur : ఫాతిమా షేక్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లో గల తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల మైనార్టీ గురుకుల పాఠశాల లో షేక్ ఫాతిమా యొక్క జయంతి ముగింపు సభ ఘనంగా నిర్వహించడం జరిగింది.వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈరోజు కూడా అవసరం మైనార్టీ బాలికల పాఠశాల మరియు కళాశాలలో షేక్ ఫాతిమా యొక్క జీవిత చరిత్రపై ఆమె చేసిన కృషి పై ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తాండూర్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది కే.గోపాల్ గారు మాట్లాడుతూ విద్యార్థులు షేక్ ఫాతిమాను ఆదర్శంగా తీసుకోవాలని అదేవిధంగా షేక్ ఫాతిమా భారతదేశము యొక్క మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయులుగా ఫలించడం జరిగిందని కులరహిత సమాజం కోసం పాటుపడిందని విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.



అనంతరం ఉర్దూ ఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్ గారు మాట్లాడుతూ మైనారిటీ ముస్లిం విద్యార్థుల కోసం విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యార్థులు ఉపయోగించుకోవాలని బాగా చదివి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.అనంతరం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ రించార్జ్ జిలాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం దేశంలోనే ఎక్కలేని విధంగా వేయిపైగా గురుకులాలు ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం హాస్టల్ సౌకర్యంతో గురుకురాలు ఏర్పాటు చేసి విద్యను అందిస్తుందని అన్నారు.గెలుపొందిన విద్యార్థులకు మళ్లీ ఎమ్మెల్యే గారితో సిల్వర్ మెడల్స్ బహుమతులు త్వరలో ఎమ్మెల్యేగా చేతుల మీదుగా అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహబూబ్ ఫాతిమా న్యాయవాదులు శ్రీనివాస్ కలాం విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies