ఎస్ఐ సార్ సాహసానికి సలాం
- విధి నిర్వహణకు వయస్సు అడ్డురాదని నిరూపించాడు ఎస్ఐ
- ఎస్ఐ మైపాల్ రెడ్డిని ఘన సన్మానం
తాండూర్ : తాండూర్ పట్టణంలో ఎస్ఐ మైపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ యువజన సంఘం.ఈ నెల 7 వ తేదీన అనుమానాస్పదంగా చెరువులో లభించిన ఓ శవాన్ని తీయ దానికి 59 ఏళ్ల వయస్సులో చెరువులోకి దిగి శవాన్ని వెలికి తీసిన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా పాత తాండూర్ పట్టణానికి చెందిన నజీర్ బేగ్(52) ఈనెల 3 నుంచి ఇంటి నుంచి తప్పిపోయాడు.అతడి బంధువుల నుండి ఫిర్యాదు అందుకున్న తాండూరుఎస్ఐ మహిపాల్ రెడ్డి తాండూరు పట్టణ శివారులోని మల్రెడ్డిపల్లి చెరువు వద్ద స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గాలించగా నజీర్ బేగ్ చెరువులో శవమై తేలాడు.శవాన్ని చెరువులో నుండి తీసేందుకు తోటి సిబ్బందితో పాటు స్థానికులు వెనుకడుగు వేయగా,తానే రంగంలోకి దిగిన ఎస్సై మైపాల్ రెడ్డి తాడు సహాయంతో చెరువులోకి దిగి శవాన్ని బయటికి తీశాడు.59 ఏళ్ల వయసులో కూడా ఎస్ఐ తన డ్యూటీలో భాగంగా చెరువులోకి దిగడం పట్ల పలువురి నుండి అభినందనలు అందుకున్నాడు.
పోలీస్ శాఖకు చెందిన ఎస్సై మైపాల్ రెడ్డి గారు గత మూడు రోజుల కిందట తాండూర్ పట్టణం నందు మల్ రెడ్డి పల్లి వార్డ్ లోగల చెరువులో పాత తాండూర్ కి చెందిన వ్యక్తి మృతి చెందడం జరిగింది అట్టి శవాన్ని బయటికి తీసే సాహసం ఎవరు చేయలేకపోతే తాండూర్ పట్టణ శాఖ ఎస్సై ధైర్య సాహసంతో ముందుకు వచ్చి చెరువులో నుంచి శవాన్ని బయటికి తీయడం జరిగింది ఇట్టి ధైర్య సాహసాన్ని గుర్తించి తాండూర్ మండల బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు రాజు గౌడ్,మరియు బీసీ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, తాండూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ టైలర్ యువ నాయకులు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని ఎస్ఐ గారికి సన్మానించడం జరిగింది.