ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం
- అన్ని పార్టీల చూపు అటువైపే
- కారణాలు అనేకం
-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రేవంత్ రెడ్డి,కమ్యూనిస్టుల
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో అక్కడ చంద్రబాబు నిర్వహించిన సభ విజయవంతం అయిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవేళ జనసేన,బీజేపీలతో టీడీపీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో అది మరింతగా కలిసి వచ్చి జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చర్చలు కూడా సాగుతున్నాయి.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బీజేపీ గురి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టి సారించింది.ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.పొంగులేటికి ఆర్థిక బలంతో పాటు పలు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్నారు.కనీసం నాలుగు నియోజకవర్గాలపై ఆయనకు పట్టు ఉంది.ఈ క్రమంలోనే పొంగులేటిని బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా జిల్లాలో బలపడాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.టీఆర్ఎస్‌కు వ్యతిరేక ఓటు బ్యాంకును తమ ఖాతాలోకి మళ్లించుకోవాలని చూస్తుంది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన స్థానాల్లో ఎక్కువగా ఖమ్మంలోనే ఉన్నాయి.ఈ క్రమంలోనే జనవరి 26వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని రేవంత్ భావిస్తున్నట్టుగా సమాచారం.పాదయాత్ర ప్రారంభానికి భారీ స్థాయిలో జనసమీకరణకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి.అయితే టీ కాంగ్రెస్‌లో నెలకొన్ని విభేదాల నేపథ్యంలో రేవంత్ పాదయాత్ర విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
కమ్యూనిస్టుల ప్రభావం పినపాక,మధిరతో పాటు జిల్లా వ్యాప్తంగా వామపక్షాలకు బలమైన పునాది ఉంది.టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే నల్గొండ, ఖమ్మం నుంచి మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని వామపక్షాలు భావిస్తున్నాయి.