Type Here to Get Search Results !

Sports Ad

TS స్టడీ సర్కిల్ TS Study Circle for Group Mains

 

TS స్టడీ శిక్షణ కేంద్రాలు

- స్టడీ సెంటర్‌లో 200 మంది మొత్తం 500 మందికి శిక్షణ
- ఖమ్మం,ఆదిలాబాద్‌,వరంగల్‌,హైదరాబాద్‌ స్టడీ కేంద్రాలు 

హైదరాబాద్‌ Hyderabad : రాష్ట్రంలోని 15 బీసీ స్టడీ సర్కిళ్లు,స్టడీ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో 182 మంది గ్రూప్‌-1 Group-1 Mains Exam ప్రధాన పరీక్షకు అర్హత సాధించారని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ తెలిపారు.ఖమ్మం,ఆదిలాబాద్‌,వరంగల్‌,హైదరాబాద్‌ స్టడీ కేంద్రాల పరిధిలో ఈ నెల 25 నుంచి మూడు నెలల పాటు ప్రధాన పరీక్ష శిక్షణ తరగతులుంటాయని పేర్కొన్నారు.ఖమ్మం,ఆదిలాబాద్‌,వరంగల్‌ స్టడీ సెంటర్లలో వంద మంది చొప్పున,హైదరాబాద్‌ స్టడీ సెంటర్‌లో Study Circle 200 మంది మొత్తం 500 మందికి శిక్షణ ఇస్తామని వివరించారు.ఇప్పటికే స్టడీ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు నేరుగా ప్రధాన పరీక్ష శిక్షణకు హాజరు కావాలని కోరారు.శిక్షణ తీసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.వీరిలో మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.ప్రతి అభ్యర్థికి మూడు నెలల పాటు నెలకు రూ.5 వేల చొప్పున స్టయిపెండ్‌,స్టడీ మెటీరియల్‌ అందిస్తామని తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies