ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరిస్తాం
- అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించారు
- మున్సిపల్ వైస్ చైర్మన్ దీపాన నరసింహులు
- బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పు
- విద్యార్థి విభాగం తాండూర్ ఇంచార్జ్ జిలాని
తాండూర్ : తాండూర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దీపాన నరసింహులు పట్టణ అధ్యక్షులు నయుం అప్పు వారితోపాటు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ ఇంచార్జ్ జిలాని తెరాస యువ నాయకులు డేవిడ్ పాల్గొన్నారు. అనంతరం వైస్ చైర్మన్,పట్టణ అధ్యక్షులు అప్పు విద్యార్థులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమకు టాయిలెట్ కోసం నీటి సమస్య ఉందని వారి దృష్టికి తీసుకొని వచ్చారు.వెంటనే స్పందించి మున్సిపల్ చైర్మన్ మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే కళాశాలకు నీటి సరఫరా చేయాలని విద్యార్థుల ముందు ఆదేశించారు.ఈనెల 20వ తేదీ వరకు సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.అనంతరం విద్యార్థులు మేడం గారికి ధన్యవాదాలు తెలిపారు.
ముగ్గుల పోటీలో పాల్కొన వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు
విద్యార్థులు సమన్వయం పాటించాలని దశలవారీగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.తాండూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో సంక్రాంతిని పురస్కరించుకొని అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీముతి పట్లోళ్ల దీప నర్సింలు పాల్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణి చేశారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాండూర్ పట్టణానికి చెందిన అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తాండూర్ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు మరియు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నరసింహులు పంపిణీ చేశారు.అర్హులైన వారు వార్డ్ నెంబర్ 31 చెందిన రాములమ్మ గారికి రూ.56000/- చెక్కు మరియు వార్డ్ నెంబర్ 5 కి చెందిన కైసర్ గారికి రూ.52000/-,వార్డ్ నెంబర్ 10కి చెందిన నర్సింలు గారికి రూ.9500/-,వార్డ్ నెంబర్ 23 కి చెందిన అమృత గారికి రూ.16000/- పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముక్తార్నాజ్,వార్డ్ అధ్యక్షులు యోగానంధ్,ఇర్షాద్,మొయిజ్,ఇంతియాజ్ బాబా,అశ్వక్ తదితరులు పాల్కొన్నారు.