బీఆర్ఎస్ లో చేరుతారా ? ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్తారా ?
- సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కేంద్రం షాక్
- తాత్కాలికంగా సీఎస్ గా రామకృష్ణ రావ్ Rama Krishna Rao
- 19 న ప్రధాని మోడీ వచ్చే ముందే ఎందుకు ?
- అధికారులలో గందరగోళం
-12 లోగా ఆంధ్ర ప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలి
బిఎచ్డి ప్రతి నిధి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేంద్ర సిబ్బంది వ్యవహారాలు,శిక్షణా శాఖ (డీవోపీటీ) తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమేశ్‌కుమార్‌ను Somesh Kumar రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన కేంద్రం సోమేశ్ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది.ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఎల్లుండిలోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరాలని సోమేశ్ కుమార్‌ను ఆదేశించిన డీవోపీటీ ఇందుకు సంబంధించి నివేదిక పంపాలని తెలంగాణ సీఎస్‌కు స్పష్టం చేసింది.2014లో రాష్ట్ర విభజన వేళ అఖిల భారత స్థాయి ఉద్యోగుల విభజనలో భాగంగా సోమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
దీనిని సవాల్ చేస్తూ అప్పట్లో ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. సోమేశ్ పిటిషన్‌ను విచారించిన క్యాట్ ఆయన్ను తెలంగాణకు కేటాయిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది.అప్పటి నుంచి సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగుతున్నారు.కాగా.. క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది.సోమేశ్ కుమార్‌కు సంబంధించి క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ కేంద్రం పట్టుబడగా ఇలాంటి నిర్ణయాలతో రెండు రాష్ట్రాల్లో సీనియార్టీ గొడవలు తలెత్తుతాయని, బ్యూరోక్రాటిక్ బ్యాలెన్స్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది.మూడు వారాలు నిలిపివేయండి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సోమేశ్ కుమార్ తరపున సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం కొన్ని నెలల క్రితం తీర్పు రిజర్వ్ చేసింది.
తాజాగా సీఎస్ సోమేశ్‌కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై ఎట్టకేలకు కీలక తీర్పును హైకోర్టు వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.తెలంగాణలో సీఎస్ సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది.ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.బీఆర్ఎస్ లో చేరుతారా ? ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్తారా ? వేచి చూడాల్సిందే ఎందుకంటే సోమేశ్ కుమార్ కి పదవి కలం 11 నెలలు మాత్రమే ఉంది.