యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి
- యువత చెడువ్యసనాలకు బానిసలు కాకూడదు
- క్రీడలపై ఆసక్తి చూపాలి
- ఎ.కె.అండ్ ఎం.కె కప్ పేరుతో క్రికెట్ క్రీడలు
- DCMS వైస్ చైర్మన్ కొత్వాల
పాల్వంచ : పాల్వంచ పట్టణంలో ఎ.కె.అండ్ ఎం.కె కప్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడలు నిర్హహించారు.ఈ పోటీలో పలువురు క్రీడాకారులు పాల్కొని విజవంతం చేశారు.సమాజంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి చూపాలి అని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.ఇటీవల మృతి చెందిన పాత పాల్వంచకు చెందిన ధర్మరాజుల అనిల్,పొదిల మనికృష్ణ ల జ్ఞాపకార్థం వారి స్నేహితులు ఎ.కె.అండ్ ఎం.కె కప్ పేరుతో క్రికెట్ క్రీడలను నిర్వహిస్తున్నారు.శనివారం మొదటి రోజు సందర్భంగా క్రికెట్ పోటీలను కొత్వాలతోపాటు మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ యువత ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకులోను కాకుండా సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.క్రీడల వలన పోటీతత్వం పెరుగుతుందన్నారు గెలుపు ఓటములు సహజమని,ఎంతవరకు గెలుపుకోసం ప్రయత్నించామనేదే ముఖ్యమని అన్నారు.ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు కొత్వాల బహుమతి అందజేశారు.ఈ కార్యక్రమంలో పాత పాల్వంచ మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ,BRSV నియోజకవర్గం అధ్యక్షులు బత్తుల మధుచంద్,పట్టణ అధ్యక్షులు జూపల్లి దుర్గాప్రసాద్,సి.కె.బి యూత్ నిర్వాహకులు పురుషోత్తం,సాయి,రఘువరన్, శ్యామ్,డి.వెంకటేశ్వర్లు, సందీప్,సుంకర వీరభద్రం క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.