యువత స్వామి వివేకనందను స్పూర్తిగా తీసుకోవాలి
-వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు
తాండూర్ : తాండూర్ పట్టణంలో గురువారం నాడు వివేకానంద జయంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణంలో నిర్వహించిన జయంతి వేడుకలో మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల దీప నర్సింలు పాల్కొన్నారు.విగ్రహాన్నికి పూలమాలలు వేసి యువకులకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.యువత అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.సమాజహితం కోసం యువత ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నది యువతే.రాజకీయాలలో యువనాయకత్వంతో మార్పురావలని యువకులు రాజకీయాలలో రాణించాలని మందలో ఒకరిగా కాకుండా వందలో ఒకరిగా జీవించాలని తెలిపారు.ఎలాంటి చేడు అలవాట్లకు లోనవ్వకుండా మంచి మార్గంలో నడుస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు కీర్తిని సంపాదించాలని ఆమె పేర్కొన్నారు.
వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు
వివేకానంద జయంతి సందర్భంగా కోటపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వివేకానంద గారు భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి అని కొనియాడారు. నేటి యువత సన్మార్గంలో ప్రయాణం చేసి ఉన్నత ఫలితాలు సాధించవచ్చు అని అన్నారు వారి ఆలోచన విధానం వారి సూక్తులను నేటి యువత చదివి కర్తవ్యం దిశగా ఆలోచన చేసి ఉన్నత ఫలితాలు సాధించాలి అని అన్నారు. నేటి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సీనియర్ నాయకులు సమ్మయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ఉపాధ్యక్షులు మోసిన్, ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్, యువజన నాయకుడు దినేష్, రైతు సంఘం అధ్యక్షులు రత్నయ్య, జి. నర్సింలు, శివకుమార్, బుగ్గాపురం ఇంచార్జ్ నర్సింలు గౌడ్,శివకుమార్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
దేశ భవిష్యత్తు యువత పై ఆధార పడి వుంది అని స్వామి వివేకానంద గారు చెప్పాడు కాబట్టి ప్రతి యువత స్వామి వివేకానంద అడుగు జాడల్లో నడిస్తే, స్వచ్ఛమైన భారత దేశం గా మారుతుంది అంటే స్వామి వివేకానంద లాగ వుంటే మంచి నడవడిక కు సూచన
ReplyDeleteమనకు దేశం ఏమి ఇచ్చింది అని ఆలోచన చెయ్యకుండా మనం దేశం కు ఏమి చెయ్యగలం అని ఆలోచన చెయ్యండి ఇది వివేకానంద నంద మాట. Gundamma
ReplyDelete