Type Here to Get Search Results !

Sports Ad

ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో సందర్శించిన జెడ్పి చైర్ పర్సన్ సునీత రెడ్డి ZP Chair Person Sunitha Reddy

 

ప్రజందరికి కంటి పరీక్షలు సునీత రెడ్డి

ధారూర్ : వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలో జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి మరియు అనంతరం బంట్వరం మండలంలో మండల సర్వసభలో కోట్ పల్లి మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత పాల్కొన్నారు.మండల అభివృద్ధి పైన సమీక్షించారు.జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.



ప్రజందరికి కంటి పరీక్షలు అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాలు.ప్రతి గ్రామంలో,మున్సిపల్ వార్డులలో కంటి పరీక్షల శిబిరాలు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, సీఈఓ జానకి రెడ్డి, సుభాశిణి, ధరూర్ ఎంపిపి విజయ లక్ష్మి  హన్మంతు రెడ్డి, సుజాత వేణుగోపాల్ రెడ్డి, సంతోష్, ప్రభాకర్,కోట్ పల్లి ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ అధికారులు,తదితరులు హాజరయ్యారు.

ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో సందర్శించిన జెడ్పి చైర్ పర్సన్ సునీత రెడ్డి 

తాండూర్ : తాండూర్ మండలంలోని జిన్గుర్తి గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి సందర్శించారు.ట్రైబల్ వెల్ఫేర్  కళాశాలలో విద్యార్థులకు దుప్పట్లు, దుస్తులు, షూస్,వంటి ఇంకా కొన్ని వస్తువులను కూడా విద్యార్థులకు పంపిణీ చేశారు.విద్యార్థులతో కలిసి మీ ఆరోగ్యం ఎలా ఉంది,మరియు మీ చదువు ఎలా ఉంది,మంచిగా చదవండి అని సంబోధించిన సలహాలు ఇచ్చారు.కళాశాల విద్యార్థుల మధ్య పట్నం సునీత రెడ్డి కూర్చొని అవభావాలను తెలుసుకున్నారు.అక్కడి కళాశాలలోని  సందర్శించి బియ్యం,కూరగాయలు రోజు వస్తాయా అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు అందరూ చదివిన చదువును మీ తల్లిదండ్రులకు కళాశాలకు మరియు ఈ జిల్లాకే పేరు తెచ్చే విధంగా చదివి పై స్థాయిలో రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రవి గౌడ్,ఎంపీపీ అనిత రవి గౌడ్,జడ్పిటిసి మంజుల వెంకటేశం,సంగం కలాన్ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్,పేద్దములు సర్పంచుల సంఘం అధ్యక్షుడు మారేపల్లి బలవంత రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,శ్రీనివాస్ గౌడ్, వసంత్ కుమార్,హరీశ్వర్ రెడ్డి,అశోక్ ముదిరాజ్,మరియు కళాశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies