Type Here to Get Search Results !

Sports Ad

సొసైటీ ద్వారా 5852 టన్నుల ధాన్యం సేకరణ In Palvancha

 

సొసైటీ ద్వారా 5852 టన్నుల ధాన్యం సేకరణ

- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు     
- ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు   
- DCMS వైస్ చైర్మన్ కొత్వాల

పాల్వంచ : పాల్వంచ పట్టణంలో సొసైటీ ద్వారా 2022 - 23 ఖరీఫ్ సీజన్ కు గాను 5852 టన్నుల ధాన్యం రైతుల వద్ద నుండి సేకరించడం జరిగిందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు,DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో పాల్వంచ మండలంలోని కారేగట్టు, ప్రభాతనగర్ (రెడ్డిగూడెం), సోములగూడెం, సంగం, దంతెలబోర, పాల్వంచ పట్టణంలోని పెటచెరువు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం 207 లారీల ద్వారా 859 మంది రైతులకు గాను 11.95 కోట్ల రూపాయల విలువగల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కొత్వాల అన్నారు.రైతులు సొసైటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామ మోహనరావు, కనగాల నారాయణ, సామా జనార్ధన రెడ్డి, చౌగాని పాపారావు, యర్రంశెట్టి మధుసూదన్ రావు, జరబన సీతారాంబాబు,మైనేని వెంకటేశ్వరరావు,భూక్యా కిషన్,నిమ్మల సువర్ణ, బర్ల వెంకటరమణ,సొసైటీ CEO జి.లక్ష్మీనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies