Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ లో సీఈవో వెంకటయ్య అరెస్ట్ CEO Venkataiah arrested in Bashirabad

 


సీఈవో వెంకటయ్య అరెస్ట్

బషీరాబాద్ : బషీరాబాద్ మండల పరిధిలో సీఈవో వెంకటయ్యను అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు.ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 13న పీఏసీఎస్ సొసైటీలో శనగలు కొనుగోలు కేంద్రంలో తూకంలో రైతులని మోసం చేసిన కేసులో శుక్రవారం రోజున సొసైటీ సీఈవో వెంకటయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కి తరలించబడును. ఇట్టి కేసులో తధుపరి దర్యాప్తు కొనసాగుతుందాని తెలిపారు.


నూతనంగా సీఈఓగా బందెప్ప నియమాకం

బషీరాబాద్ మండలం కేంద్రంలో ఉన్న నవాంద్గి సహకార సంఘంలో తూకంలో మోసం చేసిన వారిని ఉపేక్షించేది లేదని ఉపాధ్యక్షులు అజయ్ ప్రసాద్ సమస్యను లేవనెత్తగా సభ్యులంతా మూకుమ్మడి తీర్మానానికి ఆమోదం పలకగా సిఈఓ వెంకటయ్యను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పాలకవర్గం తీర్మానం ప్రవేశపెట్టారు.ఆయన స్థానంలో స్టాఫ్ అసిస్టెంట్గా వ్యవహరిస్తున్న బందెప ను సీఈవోగా ప్రమోట్ చేశారు.నవాంద్గి  వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ ఏకగ్రీవంగా తీర్మానం మేరకు సిఈఓ వెంకటయ్యను సస్పెండ్ చేసి  బషీరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓగా బందెప్ప నియమాకం చేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి,ఉపాధ్యక్షులు అజయ్ ప్రసాద్,డైరెక్టర్లు అశోక్ గౌతం,నర్సిరెడ్డి,రంగారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,నవీన్ రెడ్డి,గోపాల్,రూపులా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies