Type Here to Get Search Results !

Sports Ad

పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ - ఆ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్..!CM jagan

 

పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ - ఆ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్..!

- మంత్రులు - ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ
- ఎమ్మెల్యే ప్రోగ్రస్ రిపోర్టులు సిద్దం
- సీఎంతో సహా నేతలంతా ప్రజల్లోనే

ఆంధ్ర ప్రదేశ్ : ముఖ్యమంత్రి ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు.వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం త్వరలో తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ క్షేత్ర స్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పని తీరు పైన ఆగ్రహంగా ఉన్నారు.నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కఠిన నిర్ణయాలకు సీఎం సిద్దమయ్యారు. ఇదే సమయంలో ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పైన ఫోకస్ పెట్టారు. ఈ సమావేశంలో ఆ అంశమే కీలకం కానుంది.

                 ఈ నెల 13న మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే పార్టీ రీజలన్ కో ఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం ఈ సారి మంత్రులు ఎమ్మెల్యేల తో మీటింగ్ కు నిర్ణయం తీసుకున్నారు. గత సమావేశంలో ప్రతీ సచివాలయ పరిధిలో కన్వీనర్లు గృహ సారథుల నియమాకం పై నిర్ణయించినా ఇప్పటికీ నియామకాలు పూర్తి కాలేదు.రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకం పైన సీఎం గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఇదే అంశం పైన మరోసారి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సర్వే వివరాలను వెల్లడించారు ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వటం కష్టమని తేల్చి చెప్పారు. పని తీరు మెరుగు పర్చుకోవటానికి వారికి మరో అవకాశం ఇచ్చారు. దీంతో ఈ సమావేశంలో సీఎం ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది.

                  వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంఛార్జ్ లకు సంబంధించిన ప్రోగ్రస్ రిపోర్టులు ఐ పాక్ తో పాటుగా మరో రెండు సర్వే సంస్థలు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రజలతో ..పార్టీ కేడర్ తో మమేకం అవుతున్న విధానం.. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ ప్రత్యక సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరు పైన ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేసారు. ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ లకు సీట్లు ఖరారు చేయటం తో పాటుగా కొత్తగా ఇంఛార్జ్ లను నియమిస్తోంది.దీంతో ప్రత్యర్ది పార్టీల వ్యూహాలను గమనిస్తూ గెలుపే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక గెలుపు దిశగా నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి ఖరా ఖండిగా చెబుతున్నారు. గెలిచే వారికే టికెట్లు అనే సిద్దాంతం మాత్రమే అభ్యర్ధు ఎంపికకు కీలక సూత్రంగా చెబుతున్నారు.ఈ వ్యవహారం పై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు.

                   పార్టీ  ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం, అందులో భాగంగా ముఖ్యమంత్రి సైతం ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పల్లెనిద్రకు నిర్ణయించారని సమాచారం.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ఇక సీఎం తో పాటుగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సీట్లు..ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే గుర్తింపు పైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies