Type Here to Get Search Results !

Sports Ad

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీలు ధర్నా Dharna of BCs at Jantar Mantar in Delhi

 

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీలు ధర్నా

- బీసీల సమస్యలపై బీసీ సంక్షేమ సంఘం ధర్నా
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 
                              

ఢిల్లీ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ  కులగణన జరిపి బీసీ జనాభా లెక్కలు తేల్చాలని బీసీలకు రెండు లక్షల కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించాలని బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రతినిధులు జంతర్ మంతర్ వద్ద ధర్నా మరియు పార్లమెంటు వద్ద ధర్నా జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘీభావంగా తెలంగాణ టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కే కేశవరావు గారు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారు వచ్చి ధర్నాను ఉద్దేశించి మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన బీసీ సంఘం నాయకులు ఓబీసీ నాయకులు  ప్రసంగించారు.

అనంతరం జంతర్ మంతర్ వద్ద ఆర్.కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వేలాదిమంది బీసీలు ధర్నా నిరసన కార్యక్రమాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గారి పిలుపుమేరతో వేలాదిమంది బీసీ సంఘం నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీల సమస్యలను వెంటనే ప్రధానమంత్రి నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు మరియు జిల్లా కార్యదర్శి పేరం నాగబాబు యాదవ్ గుజ్జ కృష్ణ నీలం వెంకటేష్ లాల్ కృష్ణ ప్రసాద్ గుజసత్యం   యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ కల్లూరు మండలం అధ్యక్షులు  లింగన బోయిన పుల్లారావు వేలాదిమంది బీసీ సంఘం నాయకులు కార్యకర్తలు మహిళలు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies