Type Here to Get Search Results !

Sports Ad

మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా ? అరిగిపోయిన గుజ్జు తిరిగి రావాలంటే ? Do you have knee pain? Return worn pulp?

 



మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా ? అరిగిపోయిన గుజ్జు తిరిగి రావాలంటే ?

  

మనం చిన్నతనం( 0 to 16 years age) తీసుకున్న ఆహారం ఆధారంగానే మన body constitution ఏర్పడి వుంటుంది.మంచి ఆహారం, వయస్సు తగ్గ శారీరక శ్రమ,deciplined life without tensions మంచి నిద్ర లాంటి నియమాలను పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
సహజంగా వచ్చే మోకాలు నొప్పులకు :
(1) తగినంత నడక
(2) శారీరక శ్రమ లేదా వ్యాయామం మన వయస్సును అనుసరించి వ్యాయామం
(3) ఫిజియోథెరిపి వారి సూచనలను ప్రత్యేకమైన మోకాలి వ్యాయామం
(4) మంచి ఆహారం తగినంత విశ్రాంతి.
      ఆయుర్వేదంలో మొట్ట మొదట మందు అన్నింటికీ ఉపయోగపడేది కలబంద.కలబంద గుజ్జునీ తీసుకుని అందులో ఆవనూనె కలిపి మర్ధన చేస్తే తగ్గుతుంది.లేదా కలబంద గుజ్జును వేడి చేసి దూదితో తీసుకొని మర్ధన చెయ్యాలి.మరొకటి యూ కలిప్తస్ నూనెని తీసుకొని మర్ధన చేస్తే మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడచ్చు.
* మోకాళ్లలో గుజ్జు కోసం ఏమి చేయాలి                                    
అల్లం 10 గ్రా,
పసుపు 10 గ్రా 
4 వెల్లుల్లి రెబ్బలు,
1/2 నిమ్మకాయ రసం,
ఉప్పు కొంచెం వేసి మెత్తగా నూరి ఆ పేస్ట్ ను నొప్పిగా ఉండే మోకాలుపై లేపనం చేసి,ప్లాస్టిక్ పేపర్ ను వేసి గుడ్డతో కట్టుకోవాలి.కనీసం 3 గంటలు అలాగే ఉంచాలి.ఎక్కువ సేపు ఉన్నా నష్టం లేదు.అలా రోజూ చేయాలి కొన్ని రోజులు చేస్తే నొప్పి ఉపశమనం కలుగుతుంది.
1. మహాబీర విత్తనాలు 2 చెంచాలు రాత్రి పూట నానబెట్టి ఉదయం పరగడుపున తిని ఆ నీటిని కూడా తాగాలి. ఇలా 90 రోజులు విత్తనాలు తినాలి. దేని వలన మోకాలి జాయింట్ లో మృదులాస్థి (గుజ్జు) పెరిగి పరిష్కారం అవుతుంది.
2. చింపండులోని చింత గింజలు సేకరించి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పై తోలు తీసి పప్పును ఎండించాలి. తరువాత వాటిని మెత్తగా దంచి పొడిచేసుకొ ఒక సీసాలో భద్రపర్చుకోవాలి. ఈ పొడి ఒక చెంచా మోతాదుగా నీరు పోసి వండుతూ ఉడికిన తరువాత పాలుపోసి,చక్కెర వేసి పాయసంలా చేసుకొని ఉదయం సాయంత్రం సేవించాలి. ఈ విధంగా కొంత కాలం పాటు చేస్తుంటే సంధుల్లో కరిగిపోయిన గుజ్జు తిరిగి మరలా ఏర్పడుతుంది.ఇది పెద్దగా ఖర్చు లేని కష్టం లేని సులభ మార్గం,ఈ సమస్య మొదలవుతున్నప్పుడే పై మార్గాన్ని అనుసరిస్తే ఆపరేషన్, కీళ్ళలో రాడ్లు పెట్టించుకొని తరువాత బాధపడే బాధ తప్పుతుంది.
3. బెణుకులు వాపులు నివారణ                        
వాము,ఉప్పు,పసుపు,నువ్వులనూనె,గోధుమ పిండి అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కల్వంలో వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరి పట్టు వేస్తే వెంటనే తగ్గుతుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies