Type Here to Get Search Results !

Sports Ad

జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? Does the hair fall out a lot

 

జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ?

Does the hair fall out a lot ?

            సహజ వనరులలో ఎన్నో పోషకాలున్నాయి. ముఖ్యంగా ములక్కాయ ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎక్కువగా సహాయపడతాయి.కేవలం ఇవే కాకుండా జుట్టు సమస్యలను కూడా ఈ ములక్కాయ ఆకులు తగ్గిస్తాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

అరకప్పు ములక్కాయ ఆకులను పేస్ట్ గా చేసుకోవాలి.అందులోనే బాదం నూనె 2 టేబుల్ స్పూన్లు,ఒక టేబుల్ స్పూన్ కాక్టస్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లపై మర్దనా చేసుకోవాలి.అరగంట తర్వాత చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి.ఇలా నెలకు రెండు మూడు సార్లు చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. ఇవే కాకుండా ములక్కాయ ఆకులతో టేబుల్ స్పూన్ నెయ్యి, టేబుల్ స్పూన్ కాక్టస్ వేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి.అరగంట తర్వాత శుభ్రం చేస్తే జుట్టుకు పోషకాలు అందుతాయి.


ఇవే కాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కూరగాయలను కూడా ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉండాలి.పాలకూర ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది.ఇది ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది.ఇందులో ఐరన్,జింక్,ఇతర ఆవశ్యక విటమిన్లు లభిస్తాయి.అలాగే క్యారెట్ కూడా జుట్టు మేలు చేస్తాయి.ఇందులో విటమిన్ బీ 7 పుష్కలంగా ఉంటుంది.దీనిని హెయిర్ ప్యాక్ గా తీసుకుంటే జుట్టు దృడంగా ఉంటుంది. ఇవే కాకుండా ఉల్లిపాయ కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.ఇందులో జింక్,ఐరన్,బయోటిన్ వంటి పోషకాలు లభిస్తాయి.ఇవి జుట్టు బలంగా అయ్యేలా చేస్తాయి.పచ్చి బఠానీలో విటమిన్ ‘సి’ ఎక్కువగా లభిస్తుంది.దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.గుమ్మడి,అవిసె గింజలు సైతం కురులు దృఢంగా మారడానికి తోడ్పడతాయి. వీటిలో విటమిన్ ఇ,విటమిన్ బి,మెగ్నీషియం,జింక్,కాపర్‌తో పాటుగా ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభ్యమవుతాయి.వీటిని రోజూ ఆహారంగా తీసుకొంటే జుట్టు రాలుట తగ్గుతుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies