Type Here to Get Search Results !

Sports Ad

నూతన జాతీయ విద్యా విధానం అమలయితే దేశానికి పెన్ను ప్రమాదం If the new national education system is implemented, dangerous for the country

 

నూతన జాతీయ విద్యా విధానం అమలయితే దేశానికి పెన్ను ప్రమాదం

- దానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలి
- లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (LSO) జిల్లా అధ్యక్షులు గుగులోతు శివవర్మ నాయక్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్య విధాన0 దేశానికి అమలైతే పెను ప్రమాదం పొంచి ఉందని ఈ విద్యా విధానతో విద్యను  ప్రైవేటికరణకు, కార్పొరేటీకరణను, ప్రోత్సహించేలా ఉందని దానిని వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని LSO జిల్లా అధ్యక్షులు గుగులోతు శివవర్మ నాయక్ అన్నారు.దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంతో సుమారు 90 శాతం మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కును కోల్పోతారని అన్నారు.విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, వికలాంగులకు హామీ పడిన సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఈ జాతీయ విధానం ఉందని దుయ్యబట్టారు.

ఒకటే పరీక్షలు నిర్వహించే సంస్థ, రెగ్యులేషన్‌ సంస్థ, అక్రిడిటేషన్‌ సంస్థ, ఒకటే ప్రమాణాలు నిర్ణయించే సంస్థలను స్థాపించడం వలన రాష్ర్టాల హక్కులను కాలరాసిందని అన్నారు. అంతే కాకుండా స్కూల్‌ కాంప్లెక్స్‌ పేరు మీద పరిసరాల గ్రామాలలోని, బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తుందని అన్నారు. పూర్వ ప్రాథమిక విద్య, సెకండరీ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం లేదన్నారు. ఈ నూతన విద్యా విధానంలో ప్రైవేట్‌ విశ్వ విద్యాలయాలను, విదేశీ విద్యాలయాలను అనుమతిస్తారని అన్నారు. పాఠశాల విద్యలో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌ పేరు సాకుతో సామాజిక కార్యకర్తలు, కౌన్సిలర్‌లు, సీనియర్‌ సిటిజెన్‌ల ముసుగులో పెద్ద ఎత్తున సంఘ పరివార్‌ కార్యకర్తల నియామకం జరుగుతుందన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies