Type Here to Get Search Results !

Sports Ad

సంజీవిని అనాధ వృద్ధాశ్రయానికి నూర్బాష ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ చేయూత In Prakasham

 

సంజీవిని అనాధ వృద్ధాశ్రయానికి నూర్బాష ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ  చేయూత

ప్రకాశం : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం,పి ఆర్ కాలనిలోని సంజీవని అనాధ వృద్ధాశ్రయం వ్యవస్థాపికులు రాజశేఖర్ ఫాతిమా స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు నంద్యాల ఖాసీంవలి గారిని కలసి వృద్ధాశ్రయంలో ఉన్న 12 మంది గురుంచి వివరించి వారి సమస్యను తెలిపి తగిన సహాయం చేయవలసిందిగా కోరారు. ఫాతిమా స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు నంద్యాల ఖాశిం వలి (టీచర్) గారు సంస్థ సభ్యులతో మాట్లాడి వృద్ధులకు కావలసిన బెడ్ షీట్స్, చీరలు, నైటీలు, పండ్లు స్వయంగా  వృద్ధాశ్రమం కి వెళ్లి అందించారు.ఈసందర్బంగా సంస్థ అధ్యక్షులు ఖాసీంవలి మాట్లాడుతూ. అనాధలకు, పేదవారికి ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ నిరంతరం సేవ చేయడానికి ముందుంటుందని ఈ తెలియజేశారు. వృద్ధాశ్రయంలో ఉన్న వారికి ఎప్పుడు ఏ అవసరం పడిన తగిన సహాయం అందిస్తామని పేదలకు అండగా ఉండి ఆపదలో తోడుంటూ తగిన చేయూతను అందిస్తామని అలాగే  వృద్ధాశ్రయం అధ్యక్షులు  రాజశేఖర్ గారికి అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి పేదవారికి మరి ముఖ్యంగా వృద్ధాశ్రమ ఉన్నటువంటి ముసలివారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు నంద్యాల ఖాసింబి,దండు హుస్సేనయ్య,కె ఉస్సెన్,యన్ బాబావలి, దూదేకుల దస్తగిరి, రాఘవ మరియు తదితరులు పాల్గొన్నారు.


మానసిక వికలాంగుడి కుటుంబానికి ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ ఆర్ధిక సాయం

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ  గిద్దలూరు మండలం పొదలకుంట గ్రామం కు చెందిన బిసి యాదవ సమాజకవర్గానికి చెందిన దామెర్ల మునెమ్మ  నిరుపేదరాలు. ఆమెకు ముగ్గురు పిల్లలు, భర్త రంగయ్య అనారోగ్యంతో పిల్లలు చిన్నప్పుడే చనిపోయారు.పెద్దవాడు రంగయ్య మానసిక వికలాంగుడు 20 సంవత్సరాల నుంచి మంచానికి పరిమితమైన ఉన్నాడు. ఇతనికి వేలిముద్రలు పడటం లేదని ప్రభుత్వం నుంచి వికలాంగుల పింక్షన్ రావడం లేదు. మునెమ్మ కూలి పని చేసుకుంటూ టీ కొట్టు పెట్టుకొని జీవిస్తుంది. కుటుంబం గడవడం కష్టముగా ఉన్నది అని ఫాతిమా సేవా సంస్థను సహాయం చేయవలసిందిగా కోరారు.ఫాతిమా స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు నంద్యాల ఖాశిం వలి (టీచర్) గారు ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు తక్షణమే స్పందించి 2,000వేల రూపాయలు నగదు,రెండు చీరలు, బట్టలు మరియు 50 కేజీల బియ్యం వికలాంగ బాధిత  కుటుంబానికి  ఇంటికి వెళ్లి స్వయంగా అందించారు. ఈసందర్బంగా సంస్థ అధ్యక్షులు ఖాసీంవలి మాట్లాడుతూ... మానసిక వికలాంగ అబ్బాయికి గవర్నమెంట్ పెన్షన్ వచ్చే ఆరు నెలల వరకు ప్రతి నెల 2000 రూపాయలు (మొత్తం 12000)ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. అలాగే అనాధలకు,పేదవారికి ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ నిరంతరం సేవ చేయడానికి ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పేదలకు అండగా ఉండి ఆపదలో తోడుంటూ తగిన చేయూతను అందిస్తామని తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి పేదవారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు నంద్యాల ఖాసింబి, దండు హుస్సేనయ్య,కె ఉస్సెన్, యన్ బాబా వలి, దూదేకుల దస్తగిరి మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies