Type Here to Get Search Results !

Sports Ad

జనహృదయనేత కె.సి.ఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలి kothagudem

 

జనహృదయనేత కె.సి.ఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలి

కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్యులు, జనహృదయనేత  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలను కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఘనంగా జరగనున్నాయని, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు జరపాలని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. BRS పార్టీ కార్యకర్తల సమావేశాన్ని గురువారం పట్టణ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్ అధ్యక్షతన పాత పాల్వంచలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ  శుక్రవారం ఉదయం 10:00గం.లకు పాత పాల్వంచలోని వనమా స్వగృహంలో కెసిఆర్ గారి బర్త్ డే కేక్ ను కట్ చేస్తారన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరగనున్నాయన్నారు. పాల్వంచ పట్టణంలోని అన్ని వార్డ్ ల్లో,  మండలం పరిధిలోని అన్ని పంచాయతీల్లో బర్త్డే కేకులు, పాలాభిషేకాలు దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని కొత్వాల అన్నారు.ఈ కార్యక్రమాల్లో  BRS పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, SVRK ఆచార్యులు, మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాథం కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies