Type Here to Get Search Results !

Sports Ad

నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రీతి మృతి Preethi died while undergoing treatment in Nims


 నిమ్స్ లో చికిత్స పొందుతూ  ప్రీతి మృతి 

* ప్రీతి Preethi మృతి చెందినట్లు నిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు
*  తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం
* హఠాత్తుగా బ్రెయిన్‌ డెడ్‌, బతికే అవకాశం లేదని

హైదరాబాద్ Hyderabad : నిమ్స్ లో చికిత్స పొందుతూ  ప్రీతి Preethi మృతి సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కేఎంసీ పీజీ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో డ్యూటీలో ఉండగానే డాక్టర్ ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేయగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అప్పటి నుంచి డాక్టర్లు ప్రీతికి వెంటిలేటర్, ఎక్మోపైనే చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య నిపుణులు సుమారు 72 గంటలకు పైగా ట్రీట్ మెంట్ చేసినా ఫలితం లేకపోయింది.

ఈ నేపథ్యంలో నిమ్స్‌NIMS వద్ద పోలీసులు భారీగా మోహరించారు.డాక్టర్లు మాకేమో ఒకటి చెప్తున్నారు.ఆస్పత్రి చుట్టూ పోలీసులను పెడుతున్నారు.నిజంగా ఈ ప్రభుత్వానికి మా అమ్మాయిని బతికించాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించేది. కానీ, అలా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఠాగూర్‌ సినిమా లెక్కే ఉంది అని ప్రీతి బాబారు రాజ్‌కుమార్‌ ఆగ్రహం వెల్లగక్కారు.

ఇదిలా ఉంటే మెరుగైన చికిత్స పేరిట వరంగల్‌ ఎంజీఎం నుంచి ప్రీతిని హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు.గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగానే ఉందటూ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తూ వచ్చారు. అయితే తమకు మాత్రం ప్రీతి బ్రతుకుతుందనే భరోసా ఇస్తూ ఇప్పుడు హఠాత్తుగా బ్రెయిన్‌ డెడ్‌, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పడంపై ఆమె కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.గాంధీకి ప్రీతి! ఇదిలా ఉంటే నిమ్స్‌ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.మరోవైపు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో ఏ క్షణమైనా ప్రీతిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారనే ప్రచారం నడుస్తోంది.హైదరాబాద్‌ నిన్నటిదాకా ఆమె బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, ఇవాళేమో హఠాత్తుగా బ్రెయిన్‌డెడ్‌ అయ్యిందని చెప్తున్నారని ఆమె తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.


సీఎం గారు బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

* ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం
* విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం
* ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం
* సీఎం గారు ఆవేదన, విచారం వ్యక్తం చేశారు
* రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

 సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటిస్తున్నా0. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖం లో ఆ కుటుంబం ఉంది. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు.సీఎం గారు తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సీఎం కెసిఆర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నానని మంత్రి తెలిపారు.అలాగే ప్రీతి ఘటన పై విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే నిందితుడిని పోలీసు లు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు.ప్రీతి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని మంత్రి ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies