Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో గ్రామీణ పథకాలు భేష్‌ Rural Schemes in Telangana

 

తెలంగాణలో గ్రామీణ పథకాలు భేష్‌

తెలంగాణ Telangana : వాణి మహాజన్‌ ప్రశంస గ్రామీణాభివృద్ధి పథకాల అమల్లో తెలంగాణ భేష్‌ అని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వాణి మహాజన్‌ ప్రశంసించారు.అన్ని గ్రామ పంచాయతీలను బహిరంగ మలమూత్ర విసర్జనరహిత గ్రామాలుగా (ఓడీఎఫ్‌) ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలువడం అభినందనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్‌ భవన్‌లో బుధవారం ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న పల్లెప్రగతి కార్యక్రమాలను వాణి మహాజన్‌కు శాంతికుమారి వివరించారు. అనంతరం వాణి మహాజన్‌ మాట్లాడుతూ, అన్ని గ్రామాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, దేశానికే తెలంగాణ మాడల్‌ కావాలని అభిలషించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరాచేయడం ఓ అద్భుతమని కొనియాడారు.


      నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని సూచించారు. తెలంగాణలోని గ్రామాల్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అమలవుతున్నాయని, వాటన్నింటిలో గ్రామీణ పౌరులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.259 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఒక ట్రాక్టర్‌, ఒక ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్లను అందజేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.ఉపాధి హామీలో సూపర్‌ తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు తీరు బాగున్న దని నేషనల్‌ వాటర్‌ అవార్డు టీం సభ్యుడు ఎంఎల్‌ ఫ్రాంక్లిన్‌ కితాబిచ్చారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లిలో పర్యటించారు. ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భజలాల పెంపునకు అధికారుల కృషిని మెచ్చుకున్నా రు. పల్లె ప్రగతి, వైకుంఠధామం, అవెన్యూ ప్లాంటేషన్‌, గ్రామంలోని వీధివీధిన నాటిన మొక్కలను చేసి సంతోషం వ్యక్తం చేశారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies