Type Here to Get Search Results !

Sports Ad

బంజారాల అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంది Tandur

 

బంజారాల అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంది 

- ఘనంగా జరిగిన సేవాలాల్ జయంతి వేడుకలు
- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ
- న్యూ లోటస్ హాస్పిటల్ ని ప్రారంభం
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

తాండూర్ : తాండూర్ పట్టణంలో ఘనంగా జరిగిన సేవాలాల్ జయంతి వేడుకలు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈ రోజు సేవలాల్ మహారాజ్ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్కొన్నారు.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బంజారా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపి బంజారాల అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది.రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాలకు సమానంగా దళిత బంధు పథకం బంజారా కార్పొరేషన్ మరిన్ని పథకాలతో అందిస్తున్న కేసీఆర్.తండాలను గ్రామ పంచాయతీలగా మలచిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు.పలు గ్రామలలో సేవాలాల్ జయంతి వేడుకలలో బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం సీఎం సహాయ నిధి బీదలకు ఒక వరం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి యాలాల మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.యాలాల మండల కేంద్రానికి చెందిన దుద్యాల భారతమ్మ గారికి రూ.82000/- రూపాయల చెక్కుని అందించారు.అక్కంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య గారికి రూ.1,00000/- రూపాయల చెక్కును అందించారు.


న్యూ లోటస్ హాస్పిటల్ ప్రారంభం

ఈ రోజు తాండూర్ పట్టణంలో నూతన మున్సిపల్ ఎదురుగా న్యూ లోటస్ హాస్పిటల్ ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, మరియు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు, పట్టణ అధ్యక్షులు నయీం అప్పు, నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ విజయ్ దేవి, అస్లం మరియు ముస్లిం వెల్ఫేర్ పెద్దలు పాల్గొని హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యాలాల మండల అధ్యక్షులు  సి.రవీందర్ రెడ్డి గారు మరియు వికారాబాద్ జిల్లా కో ఆప్షన్ నెంబర్ అధ్యక్షులు అక్బర్ బాబా మండల ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies