Type Here to Get Search Results !

Sports Ad

రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే Telugu Desam Party government is coming

 

 రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే

- వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి
- గిద్దలూరు వాసిగా, మీ కుటుంబ సభ్యుడిగా అనేక అభివృద్ధి
- మీ మద్దతుతో మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా
- గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి

ప్రకాశం : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 11వ వార్డు, 9వ క్లస్టర్, 28వ యూనిట్ లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులు పట్టణ రైతు అధ్యక్షులు ఎలిశెట్టి వెంకటప్ప ఏర్పాటు చేసిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారికీ స్థానిక మహిళలు మంగళ హారతులతో ఘణ స్వాగతం పలికారు. స్థానిక నాయకులతో కలిసి వార్డులో ఇంటింటికి తిరిగి నాలుగేళ్ళ వైసీపీ పాలనలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని నమోదు చేసుకున్నారు.అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన రచ్చబండలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మొదటి రోజు నుండి ఈ రోజుటి వరకు ప్రజల పై ఆర్ధిక భారం మోపటం తప్ప, ఒక్క సంక్షేమం కూడా అందించలేదన్నారు.

               నిత్యావసర ధరలు, వంట గ్యాస్, పెట్రోల్, డిజిల్, బస్సు చార్జీలను పెంచి పేదల పై భారం మోపారన్నారు. ప్రజా వేదిక కూల్చటం మొదలుకొని బీసీ, ఎస్సి,ఎస్టీ, మైనార్టీల పై దాడులు చేయటం, ప్రశ్నించిన వారి పై అక్రమ కేసులు పెట్టటం జగన్ ప్రభుత్వానికి అలవాటు అయ్యిందన్నారు.నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసి,ఎస్సి,ఎస్టీ, మైనార్టీ ల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి పేదల సంక్షేమానికి కృషి చేయటం జరిగిందని,నేను గిద్దలూరు వాసిగా మీ కుటుంబ సభ్యుడిగా స్వయంగా పేదల కష్టాలు తెలుసుకున్నానని,పట్టణంలో ఇళ్ళు లేని 1400 మంది నిరుపేదలకు ఎన్టీఆర్ గృహాలను మంజూరు చేయటం జరిగిందని,  పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్లమోటు నుండి త్రాగునీటిని అందించటం జరిగిందని, అర్హత కలిగిన పేదలకు పెన్షన్లు అందించానని, షాదీఖానా అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయటం జరిగింది.



ఖాదర్ వలి స్వామి దర్గా కబరస్థాన్ ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులను ఇవ్వటం జరిగిందని, బీసి భవన్ కోసం స్థలం కేటాయించానని,ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధికంగా సహకారం అందించామని, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుగుదేశం హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించటం జరిగిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు మాత్రం ప్రజా సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రజా వ్యతిరేఖ పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, ప్రజా క్షేత్రంలో  వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, రాబోయే ఎన్నికల్లో గిద్దలూరులో స్థానికంగా నివాసం ఉండే,మీ కుటుంబ సభ్యుడను అయినటువంటి నాకు మీ మద్దతు తెలియచేయాలని,మీ దీవెనలతో మన గిద్దలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని ప్రజా సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.

             ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మోడీగారి కృష్ణ, సాగనబోయిన రమేష్, పూల చంద్ర, పూల పద్మనాభం, నల్లగట్ల బ్రహ్మం, షేక్ సుభాని, గురక అల్లూరయ్య, ముద్దా విజయ్ కుమార్ (అబ్బు), మరియు పట్టణ టీడీపీ అధ్యక్షులు మరియు  యూనిట్ ఇంచార్జ్ సయ్యద్ శానేశా వలి, పట్టణ ప్రధాన కార్యదర్శి పందీటి రజినీబాబు, 7వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్ యాదవ్, 3వ వార్డు కౌన్సిలర్ పాలుగుళ్ల చిన్న శ్రీనివాస రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గోపారపు గోపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ పెద్ద మస్తాన్, పార్లమెంట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి బోయిలపల్లి కిషోర్, నియోజకవర్గ TNTUC అధ్యక్షులు ఉలాపు బాలచెన్నయ్య, మైనార్టీ అధ్యక్షులు షేక్ అహమ్మద్ బాషా, మాజీ కౌన్సిలర్లు మండ్ల శ్రీనివాసులు, మేడం వెంకట స్వామి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గుర్రం దానియేలు, రాష్ట్ర TNTUC కార్యదర్శి షేక్ మదార్ వలి, షేక్ హనీఫ్, కాపు నాయకులు బొజ్జా రంగనాధ్, మరడ దిలీప్, బీసి నాయకులు చింతలపూరి బాలరాజు,  పందిళ్ళపల్లి శ్రీనివాసులు, వడ్లమాని సుబ్బారాయుడు, గులాం గోవింద్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు పఠాన్ ఆదాం ఖాన్, బద్రి బాషా, పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి సుండీ వెంకట రమణ  గువ్వల రంగనాయకులు, పట్టణ వైశ్య నాయకులు శివపురం మురళి, గర్రె సాయినాధ్, పిడతల రవితేజ, నాయబ్ ఖాజా, పట్టణ మహిళా నేతలు బొంతా లక్ష్మీదేవి, చిటికెన లలిత, కోటేశ్వరమ్మ, ఆవుల లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies