గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు రద్దు చేయాలి
* BSP తాండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ దొరశేట్టి సత్యమూర్తి
* బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ కమిటీ
తాండూర్ Tandur : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పక్క తెలంగాణలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని బీఎస్పీ రాష్ట్ర అద్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆమరణ నిరహార దీక్ష చెయ్యడం వలన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల పరీక్ష రద్దు చేయడ.బీఎస్పీ సాధించిన విజయంగా ఆయన పేర్కొన్నారు.బహుజన రాజ్యంలో తెలంగాణ నిరుద్యోగులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని,దోపిడీ దొంగల చెరల నుండి రాష్ట్రాన్ని విముక్తి చేసి బహుజన రాజ్య స్థాపనకు విద్యార్థులు,మేదావులు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మైనారిటీ కన్వీనర్ అంజాద్ పాషా,మరియు తాండూర్ అసెంబ్లీ ఉప అద్యక్షులు సొంశెట్టి జగదీశ్వర్,తాండూర్ పట్టణ మైనారిటీ కన్వీనర్ MD రహీఫ్, మైనారిటీ నాయకులు అఖిల్ బాబా,అజయ్ ప్రసాద్ యాదయ్యా, తదితరులు పాల్గొన్నారు.