125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్ Hyderabad : ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని Ambedkar statue ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్‌కు పిలిపించి లక్షలాది మంది మధ్య అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని హరీశ్ రావు తెలిపారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.