ప్రజా సమస్యల పరిష్కారమే పైలెట్ లక్ష్యం
* BRS బషీరాబాద్ మండల అధ్యక్షులు రాము నాయక్
బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ మండలంలో BRS పార్టీ నీళ్లపల్లి,నీళ్లపల్లి తండా, జలాల్ పూర్, జలాల్ పూర్ తాండ, కొర్విచేడ్ గ్రామాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించారు.ఈ సందర్భంగా బషీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు రాము నాయక్ గారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి పరిష్కరించేందుకు గౌరవ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని అన్నారు.ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎమ్మెల్యే గారు మరియు పార్టీ కార్యకర్తలు సమస్యలను గుర్తిస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కారమే పైలెట్ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని 134 కోట్ల రూపాయల నిధులను నియోజకవర్గానికి తీసుకువచ్చిన ఘనత గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికే దక్కిందని,రాబోయే రోజులు మనవేనని ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నీళ్లపల్లి సర్పంచ్ ముకుంద్,ఉప సర్పంచ్ శ్రీనివాస్,జలాల్ పూర్ సర్పంచ్ వెంకటయ్య,ఉప సర్పంచ్ హనుమంతు నాయక్ గ్రామస్థులు తదితరులు పాల్కొన్నారు.