ఉట్టి కొట్టు ప్రైజ్ మని పట్టు తాహేర్ బాండ్ పిలుపు
* హోలీ ఈవెంట్ పోటీలను జయప్రదం చేయండి
* మండలంలోని గ్రామాల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు తాహేర్ బాండ్ పిలుపు
* Basheerabad Youth President Taher band
బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ మండలం బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో హోలీ ఈవెంట్ ఉట్టి కొట్టు ప్రోగ్రాం ప్రచారం గ్రామ గ్రామాన నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు తాహెర్ బాండ్ గారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ కేంద్రంలో భద్రప గుడి సెంటర్ వద్ద నిర్వహించే హోలీ ఈవెంట్ ఉట్టి కొట్టు కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వారు పోటీలో పాల్గొని ప్రైజ్ మనీ గెలవడంతోపాటు పోటీలో ఎక్కువ మంది పాల్గొనాలని అన్నారు.మొదటి బహుమతి 50వేల రూపాయలు,రెండవ బహుమతి 25వేల రూపాయలుగా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందిస్తారని అలాగే హోలీ వేడుకలు వేలాది మందితో ఘనంగా నిర్వహిస్తారని కావున ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాబందు టీంతో పాటు గ్రామాల వారిగా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.