మాన్యవర్ కాన్సిరాం గారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం
* బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గం
తాండూర్ Tandur : తాండూర్ ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, భారతదేశ రాజకీయాలలో పెను భూకంపం సృష్టించిన బహుజన నాయకుడు శ్రీ మాన్యవర్ కాన్షిరాం గారి 89వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ సంధర్బంగా నాయకులు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన శరీరనికి ఆరోగ్యమని కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని తెలిపారు.అనంతరం యువకులు రక్తదానంచేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్,బహుజన సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా మైనార్టీ కన్వీనర్ అంజద్ పాషా,బహుజన సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు P.అరుణ్ రాజ్,బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎడ్ల సురేష్,యాలాల్ మండల అధ్యక్షులు M.కృష్ణ, పెద్దేముల్ మండల అధ్యక్షుడు S. రమేష్, ఉపాధ్యక్షులు దూలకడి రాజు, పార్టీ నాయకులు సల్మాన్ అఖిల్ బాబా, వెంకటేష్, జన్ను, యాదయ్య, తదితరులు రక్తదానం చేశారు.