బండి సంజయ్ ని వెంటనే అరెస్టు చేయాలి బిఆర్ఎస్ నాయకులు
తాండూర్ Tandur : తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పై అనుచిత,అసభ్య కరమైన వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని తాండూర్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని,ఆమెను కించ పరిచే విధంగా మాట్లాడి యావత్ మహిళలల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడిన బండి సంజయ్ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఆయనను ఎంపీ పదవి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల పైన ఈడి సిబిఐలా పేరిట దాడులు చేసిన తలోగ్గకుండ ముందు నిలబడ్డారని తెలిపారు. అలాగే 2024లో బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేది తెలంగాణ రాష్ట్రం నుండే మొదలవుతుందని నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు విజయ దేవి,మహమ్మద్ ఆసిఫ్ గారు వెంకన్న,సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్,ఇర్ఫాన్, ఉపాధ్యక్షులు హరిహర గౌడ్,ఉర్దూగర్ చైర్మన్ అబ్దుల్ రజాక్,ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటి హనుమంతు, ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్,వార్డు అధ్యక్షులు,ఇంతియాజ్ బాబా,యోగానంధ్,ఇర్షాద్, జావేద్, సిరి యాదవ్, ఇమ్రాన్, మోయిజ్,యువ నాయకులు అబ్రార్ లాల,ఉదయ్,అనంతి,అశ్వక్,సోహెల్ పార్టీ కార్యకర్తలు పాల్కొన్నారు.