Type Here to Get Search Results !

Sports Ad

ఉమెన్స్‌ డే మహిళలకు మోదీ కానుక వంటగ్యాస్‌పై బాదుడు gas increased BJP Pm modi


ఉమెన్స్‌ డే మహిళలకు మోదీ కానుక వంటగ్యాస్‌పై బాదుడు

* గృహోపయోగ సిలిండర్‌పై రూ.50 పెంపు
* రెండున్నరేళ్లలో రూ.500కు పైగా పెరుగుదల
* వాణిజ్య సిలిండర్‌పై రూ.350 వడ్డింపు

హైదరాబాద్‌ : ఉమెన్స్‌ డే సందర్భంగా దేశ మహిళలకు మోదీ కానుక వంటగ్యాస్‌పై బాదుడు.కేంద్ర బిజెపి మార్చి నెల ఒకటో తేదీ ఉదయాన్నే చమురు సంస్థలు గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.50, హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ.350.50 పెంచాయి. 8 నెలల విరామం తర్వాత గృహావసర ఎల్పీజీ ధర పెంచడం గమనార్హం. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడాన్ని భారాస సహా విపక్షాలు ఆక్షేపించాయి. స్థానిక పన్నులపై ఆధారపడి తాజా పెంపుతో హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.1,155కు, దిల్లీలో రూ.1,103కు, ముంబయిలో రూ.1,102.50కు, కోల్‌కతాలో రూ.1,129, చెన్నైలో రూ.1,118.50కి చేరింది. చమురు సంస్థ, రవాణా దూరం ఆధారంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లో రూ.1,182, వరంగల్‌లో రూ.1,174, మహబూబ్‌నగర్‌లో రూ.1,158.50కి సిలిండర్‌ ధర చేరింది. గత ఏడాది జులై 4న చివరిసారిగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధర పెంచారు. తాజా పెంపుతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.2,119.50కి ఎగబాకింది. ఈ బండ ధర జనవరిలో రూ.25 పెరిగింది. 2020 జూన్‌ నుంచి 2022 జూన్‌ వరకు వాటిల్లిన నష్టాలకు గానూ గత అక్టోబరులో రూ.22,000 కోట్ల గ్రాంటును చమురు సంస్థలకు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

విమాన ఇంధన ధర తగ్గింపు

అంతర్జాతీయ ధరలకు లోబడి విమాన ఇంధనం ఏటీఎఫ్‌ ధరను చమురు సంస్థలు 4% తగ్గించాయి. దిల్లీలో ఈ ధర కిలోలీటరుపై రూ.4,606.50 తగ్గి రూ.1,07,750కి చేరింది. గత నెలలో ఇంతే మొత్తం పెరగ్గా, ఇప్పుడు తగ్గింది.ఉజ్వల్‌ పథకంలో కనెక్షన్‌ తీసుకున్నవారికి రూ.200 రాయితీ ఇస్తున్నా, ఇతర వినియోగదారుల్లో చాలామందికి ప్రభుత్వం ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో గత నెలలో వినియోగదారుల గ్యాస్‌ సిలిండర్‌పై రాయితీ రూ.40.71 మాత్రమే వచ్చింది. తాజా పెంపు నేపథ్యంలో రాయితీ ఎంతన్నదానిపై వారంలోపు స్పష్టత వస్తుందని గ్యాస్‌ డీలర్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.07 కోట్ల గ్యాస్‌ కనెన్షన్లు ఉన్నాయి. 2020 సెప్టెంబరులో రూ.646.50 ఉన్న ధర ప్రస్తుతం రూ.1,155.00కు చేరింది. అంటే రెండున్నరేళ్లలో రూ.508.50 ధర పెరిగింది.

మోసగించిన బిజెపికి తగిన గుణపాఠం చెప్తాం



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies