మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
* కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలి
* రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతుంది కేంద్రం వీటిపై దృష్టి సారించాలి
* రోహితన్న యువసేన విజయ్ కుమార్
బషీరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదికి రోజులు దగ్గరపడ్డాయని బీఆర్ఎస్ యువసేన యువకుడు విజయ్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోజు రోజు కు గ్యాస్,పెట్రోల్,డీజిల్,నిత్యవసరాల ధరలు పెంచడం ద్వారా నిత్యవసర వస్తువులు పెరిగి సామాన్య మానవుడి జీవితంపై భారం పెరుగుతుందన్నారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రోజురోజుకు సామాన్య ప్రజలపై భారం మోపుతూ ఆదాని,అంబానీ లాంటి పెద్దలకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు.ఒక పక్క నిరుద్యోగులను మోసం చేస్తూ, రైతులకు గిట్టుబాటు ధర అందించక పోవడం,బ్యాంకులలో బడాబడా నేతలులోన్లు తీసుకొని కట్టకపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలను పట్టించుకోకుండా నిత్యవసర వస్తువులు అయినా గ్యాస్,పెట్రోల్,డీజిల్ పెంచుతూ ప్రజలపై భారం మోపుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నశించాలి,వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని డిమాండ్ చేశారు.