పేద ప్రజల నడ్డి విరిచిన మోడీ ప్రభుత్వం
* నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
* కేంద్ర బిజెపి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంపుకు నిరసన
* తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
* బషీరాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా
బషీరాబాద్ Basheerabad : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాములు నాయక్ గారి ఆధ్వర్యంలో సిలిండర్ గ్యాస్ ధర పెంపుకు నిరసనగా ధర్నాతో పాటు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రాములు నాయక్,PACS చైర్మన్ వెంకట్రామిరెడ్డి,మండల మహిళా విభాగం నాయకురాలు జయమ్మ,ఎంపిటిసి లక్ష్మీబాయి,పార్టీ నాయకులు మహబూబ్ పాషా,శివరాం నాయక్ మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం 14 సార్లు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి సామాన్య ప్రజల పేద ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు.మోడీ రాకముందు గ్యాస్ సిలిండర్ ధర రూ.410/- రూపాయలు ఉండగా నేడు రూ.1155/- రూపాయల వరకు పెంచి సామాన్య ప్రజల యొక్క ఆదాయాలను గండి కొడుతూ ధనవంతులకు మేలు చేస్తున్నారని వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్ ధరలు,డీజిల్ ధరలు నిత్యవసర సరుకులు వంటనూనె ఇతర సరుకులు ధరలుకేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఆకాశానికి ఎత్తాయని వెంటనే ధరలు తగ్గించాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని అన్నారు.కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదాని,అంబానీల గ్యాస్ కంపెనీలకు మేలు చేయడానికి సిలిండర్ గ్యాస్ ధరలు పెంచుతున్నారని లక్షల కోట్ల రూపాయలు ఆదానీలకు అంబానీలకు దోచిపెట్టడమే ధ్యేయంగా నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాడని వెంటనే ధరలు తగ్గించాలని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వర్,మండల ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్,మండల యూత్ అధ్యక్షులు తాహీర్ బాండ్, ఎంపీటీసీ పవన్ ఠాగూర్, సర్పంచులు సాబీర్ పాషా, లాలప్ప, ఉప సర్పంచులు బ్రహ్మానంద రెడ్డి,ధన్సింగు, పకీరప్ప,వెంకటప్ప,పార్టీ వివిధ గ్రామ అధ్యక్షులుశంకర్ నాయక్,మునీందర్, రాజు నాయక్,కోటప్ప, రవి, మక్బూల్ పాష, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, సాయిలు గౌడ్, సిద్దు, తిరుపతి, నరసింహులు, శివ, చందర్,తావుర్య నాయక్, నర్సింలు యాదవ్ గార్లతో పాటు మహిళలు తదితరులు పాల్కొన్నారు.