మహిళలను వేధిస్తే ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వండి సిపి
హైదరాబాద్ Hyderabad : యువతులు, మహిళలు ఎవరైనా వేధించిన ఇబ్బందులకు గురిచేసిన డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 63039 23700 కు సమాచారం ఇవ్వాలని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు.స్నేహితుల వివరాలు తల్లిదండ్రులకు తెలిసి ఉండాలని తెలిపారు. సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.