కొర్విచెడ్ లో ట్రాక్టర్ పైనుంచి పడి కార్మికుడి మృతి
బషీరాబాద్ Basheerabad : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గ్రామ పంచాయతీ కార్మికుడి మాల సంజీవ్(37) గురువారం ట్రాక్టర్ పైనుంచి పడి మృతి సంజీవ్ మృతి చెందాడు.ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంజీవ్ పంచాయతీలో వాటర్మెన్ ఉన్నాడు.అయితే ట్రాక్టర్ మరమ్మతుల కోసం మరో కార్మికుడు కలిసి తాండూరుకు వెళ్లాడు.తిరిగి వస్తుండగా నవల్గా గేటు వద్ద ట్రాక్టర్ పైనుంచి జారి కింద పడ్డాడు.తీవ్రంగా గాయపడిన సంజీవను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతుడికి భర్య బుజ్జమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదు కోవాలని గ్రామస్తులు కోరారు.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తం డీఎస్పీ శేఖర్ గౌడ్
సైబర్ నేరాగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. గురువారం రోజు మండలంలోని గొట్టిగఖుర్ధు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ
వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.ఫోన్లలో ఓటీపీ,ఓఎల్ ఎక్స్,పేటీఎం,గూగుల్ పే,ఫోన్ పే, కేవైసీలను అప్ డేట్ చేయమని వచ్చే మెసేజ్లకు స్పందించ కూడదన్నారు.సైబర్ క్రైమ్ కు గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంది అన్నారు.గ్రామాలలో ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారని,అందుకే సైబర్ నేర గాళ్ల చేతిలో ఎక్కువగా మోసపోతున్నారని తెలి పారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారన్నాని, ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,గ్రామస్థులు,పోలీసుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎక్మాయి గ్రామ సమీపంలో రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామ సమీపంలోని అంబబాయి వాడుకలో అక్రమంగా ఇసుక తరలించడానికి ప్రయత్నించిన రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకు న్నారు.ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి కథనం ప్రకారం అల్లాపూర్ గ్రామానికి హేమంత్, నంద్యానాయక్ తండాకు చెందిన చౌవన్ రూప్లా ఇద్దరు తమ ట్రాక్టర్లతో ఇసుక నింపడానికి అంబబాయి వాడుకలో నిలిచి ఉండగా గమనించిన పోలీసులు రెండు ట్రాక్టర్లను పోలీస్ విచారించారు.కాగా వీరు తరచూ ఇసుక అక్రమంగా రవాణా చేస్తుంటారని పోలీసులు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నరు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.